E-Paper
Advertisement

Lavanya: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య.. అడ్డంగా బుక్కయిందిగా!

Lavanya: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య.. అడ్డంగా బుక్కయిందిగా!
Advertisement

Lavanya: రాజ్ తరుణ్ (Raj Tarun) మాజీ ప్రియురాలు లావణ్య (Lavanya) అందరికీ గుర్తుండే ఉంటుంది. మరిచిపోవడానికి ఆమె ఏమైనా సామాన్యమైన రచ్చ చేసిందా? లాస్ట్ ఇయర్ టాలీవుడ్ టాప్ కాంట్రవర్సీలలో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం కూడా ఉందంటే.. వారి మధ్య ఏ రేంజ్‌లో గొడవలు నడిచాయో అర్థం చేసుకోవచ్చు. వారిద్దరూ సుమారు 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారని, రహస్యంగా గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య అప్పట్లో పోలీసులకు తెలిపారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో కొనుగోలు చేసిన ఇంటి విషయంలో కూడా వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు లావణ్య మరోసారి అడ్డంగా బుక్కయింది. అవును, తాజాగా ఆమె చేసిన పనితో.. రాజ్ తరుణ్‌‌పై సింపతీ కూడా బాగా పెరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే..

Also Read- Niharika Konidela: నాగబాబు సినిమాల పై నిహారిక షాకింగ్ కామెంట్స్…మోసం చేశారంటూ!

బైకును ఢీ కొట్టి..

Advertisement

మల్లెపల్లి వద్ద లావణ్య మద్యం మత్తులో కారు నడుపుతూ ఒక బైక్‌ను ఢీకొట్టడంతో, పోలీసులు ఆమెపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో మరియు స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం మత్తులో కారు నడుపుతూ.. మల్కాపూర్ (మం) మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టి, ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన లావణ్యను.. అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆమె గ్రామస్తులతో గొడవకు దిగడంతో.. అక్కడ పెద్ద వాగ్వివాదం జరిగింది. లావణ్యను సారీ చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో.. ఆమె వారితో గొడవకు దిగింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులపై కూడా ఆమె గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది.

Also Read- OTT Movie: రిలీజైన రెండున్నర సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి.. చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు!

లావణ్యపై కేసు నమోదు

Advertisement

వెంటనే ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి, అందులో పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, కారును కూడా సీజ్ చేసి, కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆమె కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లుగా గ్రామస్తులు పోలీసులకు తెలపడంతో, కారుని సీజ్ చేసి, ఆమెపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లావణ్య పేరు మరోసారి వార్తలలో మారు మోగుతోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ విషయంలో మోసపోయిందని కొంత మందికి ఆమెపై జాలి ఉంది. కానీ, ఈ వ్యవహారంతో అది కూడా పోయినట్టే. చూద్దాం మరి.. ఈ విషయం ఎంత వరకు వెళుతుందో..!

Also Read- Comedy Series OTT : యమలోకం నుండి ఎస్కేప్… అమ్మాయి బాడీలోకి గ్యాంగ్ స్టర్… కామెడీతో కడుపునొప్పి తెప్పించే

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×