E-Paper
Advertisement

Niharika: చరణ్‌కు యాక్సిడెంట్ అని చెప్పగానే షాకైన నిహారిక.. వీడియో వైరల్!

Niharika: చరణ్‌కు యాక్సిడెంట్ అని చెప్పగానే షాకైన నిహారిక.. వీడియో వైరల్!
Advertisement

Niharika: ‘పెద్ది’ (Peddi) మూవీ సెట్స్‌లో రామ్ చరణ్‌ (Ram Charan)కు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి నిహారిక (Niharika Konidela) షాక్‌కు గురయ్యారు. తను ఇంత వరకు ఫోన్ చూడలేదని, ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఆమె నిర్మించిన ‘రాకాస’ (Rakasa) మూవీ ప్రమోషన్స్‌లో బిజీ బిజీ ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిహారిక (Niharika)కు అక్కడి మీడియా రామ్ చరణ్‌కు యాక్సిడెంట్ జరిగింది కదా? ఇప్పుడెలా ఉంది? అని అడగడంతో ఒక్కసారిగా నిహారిక షాకయింది. అంతే, తన పక్కనే ఉన్న పీఆర్‌ని చూడగానే, ఆయన భయపడాల్సిందేమీ లేదు.. చిన్న గాయం అయిందట.. అని చెప్పగానే నిహారిక ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే మరో మీడియా వ్యక్తి మీరు ఫోన్ చూడలేదా? అని అడిగితే.. ‘ఇంత షాకింగ్‌గా అడుగుతారా.. నేను ఇప్పుడే ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాను.. ఇంకా ఫోన్ చూసే టైమ్ కూడా నా దగ్గర లేదు, నాకు ఈ విషయం తెలియదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. దీని సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Harish Shankar: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్.. హద్దు మీరితే అదే చేస్తా!

రామ్ చరణ్ క్షేమంగా ఉన్నారు

Advertisement

ఇదిలా ఉంటే రామ్ చరణ్‌కు జరిగిన ప్రమాదంపై చిత్రయూనిట్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎక్కడ ఫ్యాన్స్ ఆందోళన చెందుతారో అని.. విషయం మొత్తాన్ని ఈ ప్రకటనలో తెలిపారు. ‘‘పెద్ది సినిమా సెట్స్‌లో నిన్న జరిగిన చిన్న ఘటన గురించి వచ్చిన వార్తలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. రామ్ చరణ్ పూర్తిగా క్షేమంగా ఉన్నారు. షూటింగ్ సమయంలో ఎడమ కంటికి చిన్న గాయం కావడంతో ఒక చిన్న ప్రొసీజర్ చేశారు. ఆయన రేపటి నుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్నీ కంట్రోల్‌లోనే ఉన్నాయి. సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయి. -టీమ్ పెద్ది’’ అని చిత్రయూనిట్ ఈ ప్రకటనలో తెలిపారు.

Also Read- Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’.. మణిశర్మ డ్యూటీ ఎక్కేశారోచ్!

ట్రైలర్‌తో అంచనాలు ఆకాశానికి..

Advertisement

‘రాకాస’ విషయానికి వస్తే.. ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని మ్యాగ్జిమమ్ ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు టీమ్ ఎంతగానో కృషి చేస్తోంది. వైవిధ్యమైన వీడియో కంటెంట్‌తో ఇప్పటికే సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశారు. ఇక బుధవారం వదిలిన ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు. ట్రైలర్ మంచి ఆదరణను రాబట్టుకుంటూ.. ప్రతి ఒక్కరి చేత.. గ్యారంటీగా హిట్ సినిమా అని అనిపించుకుంటోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక నిర్మిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్నట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది.

Also Read- Lavanya: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య.. అడ్డంగా బుక్కయిందిగా!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×