E-Paper
Advertisement

గూస్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి2 టైటిల్.. ప్రభాస్ విశ్వరూపం చూడాల్సిందే?

గూస్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి2 టైటిల్.. ప్రభాస్ విశ్వరూపం చూడాల్సిందే?
Advertisement

Kalki 2 Title: పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో కల్కి సీక్వెల్ సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ (Nag Aswin)అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ టైటిల్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాలి. మరి కల్కి సీక్వెల్ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు? ఇందులో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందనే విషయానికి వస్తే?

కర్ణ 3102 బీసీ..

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కొట్టకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వల్ గా రాబోతున్న ఈ చిత్రానికి ‘కర్ణ 3102 బీసీ’ (Karna 3102 BC)అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. కల్కి సీక్వెల్ సినిమా మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూ కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి కర్ణ 3102 బీసీ అని టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

కర్ణుడిగా కనిపించబోతున్న ప్రభాస్..

Advertisement

ఇక ప్రభాస్(Prabhas) కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నట్టు పార్ట్ వన్ లోనే చూపించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 ప్రభాస్ కర్ణ పాత్ర హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కర్ణుడిగా ప్రభాస్ పాత్ర గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని ప్రభాస్ కర్ణుడి పాత్రలో విశ్వరూపం చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా కల్కి 2 టైటిల్ గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలు పెరిగిపోయాయి.

దీపికా స్థానంలో సాయి పల్లవి..

Advertisement

ఇక ప్రభాస్ త్వరలోనే కల్కి 2 సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీకానున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మరొక నెల రోజులలో షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాలో కూడా బిజీ కానున్నారు. త్వరలోనే ఫౌజీ షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ కల్కి 2 షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. ఇక పార్ట్ వన్ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా సీక్వెల్ సినిమా నుంచి ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో సాయి పల్లవి నటించబోతునట్టు తెలుస్తోంది.

Also Read: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి రాబోతున్న నిహారిక రాకాస ..స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×