Ibomma Ravi: రోజులు మారుతున్న కొద్దీ సమాజంలో కొన్ని విషయాల పైన ఉన్న ఒపీనియన్ కూడా మారిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే సినిమా రంగంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పాత సినిమాల్లో హీరో పాత్ర అంటే 10 మందికి ఆదర్శంగా ఉండేది. అన్యాయాన్ని ఎదిరించేది, అక్రమాలకు అడ్డుకట్ట వేసేది. కానీ ఈ రోజుల్లో సినిమా కంప్లీట్ గా మారిపోయింది. చాలామంది ఆడియన్స్ వైలెన్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో హీరోల పాత్రలు గమనిస్తే సొసైటీకి అగైనెస్ట్ గా ఉంటాయి.
ఈ రోజుల్లో సొసైటీకి అగైన్స్ట్ గా ఉన్న వాళ్లే హీరోగా మారుతున్నారు. అదే నిజజీవితంలో ఐ బొమ్మ రవి కేసులో కూడా జరుగుతుంది. చట్టరీత్యా అతని చేసింది నేరం అయినా కూడా చాలామంది అతనిని ఒక రాబిన్ హుడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అయితే సినిమాను ప్రేక్షకుడికి కొంత మేరకు దూరం చేసిన దర్శక నిర్మాతలను కూడా తప్పు ఉండటం బట్టి ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినిమాలు పైరసీ చేస్తున్న కేసులో ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లు ఐ బొమ్మ రవి కేసులో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. హెచ్ డీ లో సినిమా పైరసీ పై గుట్టు విప్పాడు. కస్టడీలో సంచలన విషయాలను బయట పెట్టేసాడు. సినిమాలను హెచ్ డీ ఫార్మేట్లో ఏ విధంగా పైరసీ చేసేవాడో నిగ్గు తేల్చారు దర్యాప్తు అధికారులు.
టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పైరసీ చేస్తున్నట్లు గుర్తింపు. టెలిగ్రామ్ ఛానల్ లోని హెచ్ డీ హబ్ సహాయంతో హెచ్ డీ సినిమాలను పైరసీ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు గుర్తించారు. క్యూబ్ నెట్‌వర్క్ ను సైతం హ్యాక్ చేసినట్లు తెలుస్తుంది. క్యూబ్ నెట్వర్క్ కు చెందిన శాటిలైట్ లింకును హ్యాక్ చేసి హెచ్ డి పార్మెట్లో సినిమాల రికార్డు చేసి వాటిని టెలిగ్రామ్ ఛానల్లో అమ్మినట్లు పోలీసులు తెలిచారు.
పైరిసీదారులందరికీ కలిపి హెచ్ డీ హబ్ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నట్లు గుర్తించారు. ఆ టెలిగ్రామ్ చానల్లో పైరసి సినిమా లింకును అప్లోడ్ చేసి 100 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హిట్, థండేల్, కిష్కింధ పూరి సినిమాలను ఇలాగే పైరసీ చేసి బొమ్మలో అప్ లోడ్ చేశాడు రవి.
రవి చేసింది చట్ట నిత్య నేరం. అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ తరుణంలో సినిమా దర్శక నిర్మాతలలో కూడా కొంతమేరకు మార్పు వచ్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఊహించని విధంగా కేవలం 99 రూపాయలకి నేడు టిక్కెట్ రేట్లు పెట్టారు అంటే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. చాలామంది థియేటర్ కు కూడా టికెట్ రేట్లు తగ్గిన తర్వాత రావడం మొదలుపెట్టారు. టికెట్ రేట్లు తగ్గడం ఒక కారణం ఆన్లైన్లో సినిమా అవైలబుల్ లేకపోవడం మరో కారణం. ఈ రెండు కారణాల వల్లనే నేడు థియేటర్ కు ప్రేక్షకులు వస్తున్నారు.
Also Read: Shiju AR: విడాకులు తీసుకున్న ప్రముఖు రియలిస్టిక్ యాక్టర్, అదే కారణం?