E-Paper
Advertisement

CNG–PNG Price Drop: వాహనదారులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్, CNG–PNG ధరల తగ్గింపు!

CNG–PNG Price Drop: వాహనదారులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్, CNG–PNG ధరల తగ్గింపు!
Advertisement

Modi Govt New Year Gift: 2025 ముగింపు సందర్భంగా మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా దేశంలోని కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందించింది. పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని ఫలితంగా జనవరి 1, 2026 నుంచి CNG, దేశీయ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరలలో యూనిట్‌కు రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గింపు ఉంటుంది. ఈ విషయాన్నిPNGRB సభ్యుడు A.K. తివారీ కన్ఫార్మ్ చేశారు. ట్యాక్స్ ల తగ్గింపుతో నిర్మాణం, రవాణా రంగంతో పాటు కిచెన్ ఖర్చులు తగ్గనున్నట్లు తెలిపారు.

నేరుగా వినియోగదారులకు ప్రయోజనం

గతంలో గ్యాస్ ధరలు మూడు వేర్వేరు దూర ఆధారిత జోన్‌లపై ఆధారాపడి ఉండేవి. ఇది ఇప్పుడు కేవలం రెండు జోన్‌లకు తగ్గించబడింది. కొత్త విధానంతో జోన్-1 రేటును సవరించి రూ.54గా నిర్ణయించారు. గతంలో ఇది రూ.80గా, రూ.107గా ఉండేది. ఈ నిర్ణయందేశంలోని 312 ప్రాంతాలలో పనిచేస్తున్న 40 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలను ప్రభావితం చేస్తుంది. తక్కువ రేట్ల పూర్తి ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధరల తగ్గింపు ప్రయోజనాన్ని కంపెనీలు వాస్తవానికి ప్రజలకు బదిలీ చేస్తున్నాయా? లేదా?  అని నియంత్రణ బోర్డు పర్యవేక్షిస్తుంది.

Advertisement

Read Also: మైలేజ్ టెస్ట్ లో అదరగొట్టిన టాటా సియెర్రా.. బాబోయ్ లీటర్ కు అన్ని కిలోమీటర్లా?

చౌకగా, సులభంగా గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేట్ వాహన యజమానులు, టాక్సీ డ్రైవర్లకు మాత్రమే కాకుండా, పైప్డ్ గ్యాస్ ఉపయోగించే కుటుంబాలకు గృహ ఖర్చులను కూడా తగ్గిస్తుంది.  ఈ ధర తగ్గింపు ద్వారా, దేశ వ్యాప్తంగా సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించాలని మోడీ ప్రభుత్వం భావిస్తుంది.వ్యాట్‌ను తగ్గించడానికి, మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు కలిసి దేశ వ్యాప్తంగా గ్యాస్ నెట్‌వర్క్‌ ను విస్తరిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో చౌకైన ధరలు, సులభంగా సహజ వాయువు లభించేలా తగిన చర్యలు చేపడుతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న గ్యాస్ ధరల తగ్గింపుపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read Also:  దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న క్రేజీ యమహా బైక్స్.. లైనప్ చూస్తే అదిరిపోవాల్సిందే!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×