E-Paper
Advertisement

Vikarabad district Murder: ప్రేమ పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. కట్నం కోసం కొట్టి చంపిన భర్త

Vikarabad district Murder: ప్రేమ పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. కట్నం కోసం కొట్టి చంపిన భర్త
Advertisement

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడిగా మారి, తన తల్లిదండ్రులతో కలిసి భార్యను హత్యచేశారు. ఎనిమిది నెలల క్రితం అనూష, పరమేష్‌లు ప్రేమ వివాహం చేసుకోగా.. మొదటి నుంచీ ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులైన లాలమ్మ, మొగులప్పలకు ఇష్టం లేదు. దీనికి తోడు అదనపు కట్నం తేవాలంటూ వారు అనూషను తరచూ వేధింపులకు గురిచేసేవారు.

ఈ క్రమంలోనే ఇంట్లో జరిగిన గొడవలో భర్తతో పాటు అత్తమామలు కలిసి అనూషపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనూష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దారుణం జరిగిన అనంతరం నిందితులు అనూష కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అక్కడి నుంచి పరారయ్యారు. తన కూతురిని వరకట్నం కోసమే వేధించి చంపేశారని అనూష తల్లి చంద్రమ్మ ఆరోపిస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

ఎన్నో కలలతో..  తన ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో నూరేళ్లూ కలిసుంటానని అడుగు పెట్టిన ఆ ఇంటి మహాలక్ష్మి.. కేవలం ఎనిమిది నెలలకే శవమై బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన నాగరిక సమాజం తలదించుకునేలా చేస్తోంది.

ప్రేమించిన హృదయమే పగబట్టింది. అవును.. అనూష, పరమేష్‌లకు ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. అది వారిద్దరి మధ్య ఉన్న ప్రేమతో కుదిరిన బంధం. కానీ..  అనూషకు తెలియదు.. తాను ప్రేమించిన వ్యక్తి గుండెల్లో కరుణ లేదని, తన అత్తమామల మనసుల్లో ధనాశ అనే విషం నిండి ఉందని. మొదటి నుంచీ ఈ పెళ్లి ఇష్టం లేని అత్త లాలమ్మ, మామ మొగులప్పలు.. ఆమెను కనికరించలేదు. అదనపు కట్నం తేవాలంటూ ప్రతిరోజూ ఆ ఇంటి గోడలు అనూష ఆక్రందనలను వింటూనే ఉన్నాయి.

Advertisement

కట్టుకున్న భర్తే అండగా ఉంటాడని భావించిన అనూషకు, ఆ పరమేషే కాలయముడిగా మారాడు. కనికరం లేకుండా భర్త, అత్తమామలు కలిసి ఆమెపై దాడి చేస్తుంటే.. ఆమె ఎంతలా విలవిలలాడి ఉంటుందో ఊహిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ, తన ప్రాణాన్ని నిలుపుకోవాలని ఆమె చేసిన పోరాటం చివరికి ఓడిపోయింది.

“నా కూతురు ప్రేమను నమ్మి వెళ్ళింది.. కానీ ఆ వరకట్న పిశాచాలు నా బిడ్డను బలి తీసుకున్నాయి” అంటూ తల్లి చంద్రమ్మ చేస్తున్న రోదనలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. దారుణం చేశాక, సమాచారం ఇచ్చి మరీ పారిపోయిన ఆ ముగ్గురిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం వారి క్రూరత్వానికి నిదర్శనం.

ALSO READ: Wedding Viral Video: అద్భుతంగా తయారైన వధువు.. వెనుకాల పరిగెత్తుకుంటూ వచ్చిన ఫోటో గ్రాఫర్, అంతలోనే నవ్వులే నవ్వుల్..

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×