E-Paper
Advertisement

RC 17: కథ గురించి కీలక అప్డేట్.. రామ్ చరణ్ తో.. సుకుమార్ ఏం ప్లాన్ చేశారంటే..!

RC 17: కథ గురించి కీలక అప్డేట్.. రామ్ చరణ్ తో.. సుకుమార్ ఏం ప్లాన్ చేశారంటే..!
Advertisement

RC 17: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతోమంది మెగా అభిమానులు తెగ ఎదురుచూస్తున్న సినిమా.. RC17. ఈ సినిమాపై లోపలి వర్గాల నుంచి వస్తున్న సమాచారం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయిక కావడంతో ఈ సినిమా చుట్టూ ఆసక్తి మరింత పెరిగింది.
ఇక ఈ సినిమా కథ గురించి ప్రస్తుతం ఒక వార్త తెగ వినిపిస్తోంది. అదేమిటంటే ప్రారంభంలో సుకుమార్.. రామ్ చరణ్ కోసం ఒక కథను ఫైనల్ చేశారంట. ఆ కథతో స్క్రిప్ట్ వర్క్ కూడా సాఫీగానే సాగింది. ఇద్దరి మధ్య చర్చలు బాగానే జరిగాయి. అయితే మధ్యలో సుకుమార్‌కు ఓ కొత్త ఐడియా వచ్చిందట. ఈ కొత్త కథ స్కేల్ పరంగా మరింత పెద్దది..విజన్ పరంగా ఇంకా బలంగా ఉందని టాక్. తనకు ఇప్పటివరకు వచ్చిన ఆలోచనలకన్నా ఇది ప్రత్యేకంగా అనిపించడంతో..ఆ కథను రామ్ చరణ్‌కు నరేట్ చేశారట.

కథ విన్న వెంటనే రామ్ చరణ్ చాలా ఆనందంగా స్పందించారని అంటున్నారు. ఈ కథే చేయాలి అని వెంటనే ఓకే చెప్పేశారట. దీంతో ముందుగా అనుకున్న కథను ప్రస్తుతం పక్కన పెట్టారు. అందుకే సుకుమార్ – రామ్ చరణ్ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉంటాయన్న ప్రచారం నిజం కాదని స్పష్టమైంది. చాలామంది రెండు కథల్ని కూడా చేస్తారని భావించారు. కానీ ప్రస్తుతం ఒకే సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారని సమాచారం.

Advertisement

ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం సుకుమార్ చాలా లోతుగా స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారని టాక్. కథ మాత్రమే కాదు, పాత్రల రూపకల్పన, కథ నడిచే నేపథ్యం, విజువల్ ప్రెజెంటేషన్ అన్నీ కూడా గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. తొందరపడి సినిమా చేయడం కన్నా, పక్కాగా సిద్ధం చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నారని చెబుతున్నారు.

రామ్ చరణ్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమాతో ఇద్దరి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అదే మ్యాజిక్‌ను మరోసారి, మరింత పెద్ద స్థాయిలో రిపీట్ చేయాలనే లక్ష్యంతో ఈసారి ఇంకా భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇవన్నీ చూస్తుంటే RC17 రామ్ చరణ్.. సుకుమార్ ఇద్దరి కెరీర్‌లో ఒక కీలకమైన మైలురాయిగా నిలవబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ భారీ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ALSO READ: Natural Star Nani : నానితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న ప్రభాస్ బ్యూటీ.. త్వరలో అఫీషియల్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×