E-Paper
Advertisement

Sathupalli Case: తహశీల్దార్ తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం..!

Sathupalli Case: తహశీల్దార్ తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం..!
Advertisement

Sathupalli Case:స్వేచ్ఛ బ్యూరో :- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల తహసీల్దార్, ఐకెపీ కమ్యూనిటీ సర్వేయర్ల తీరుపై నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిపై నమోదైన అట్రాసిటీ కేసు వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరణాత్మక విచారణ నివేదికను 30 రోజుల్లోగా సమర్పించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఆదేశాలను పాటించడంలో విఫలమైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 కింద సివిల్ కోర్టు అధికారాలను వినియోగిస్తామని కూడా కమిషన్ స్పష్టంగా హెచ్చరించింది.దళిత హక్కుల కోసం ప్రశ్నించిన గొంతును నొక్కే ప్రయత్నమా అన్న ప్రశ్నతో సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి రెవెన్యూ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి. దళితుల హక్కుల కోసం నిలదీసిన సామాజిక కార్యకర్తపై నమోదైన వివాదాస్పద ఎఫ్ఫైఆర్ వ్యవహారంలో జాతీయ ఎస్సీ కమిషన్ నేరుగా జోక్యం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎస్సి ఎస్టీ అట్రాసిటి కేసు న‌మోదుకు ఆదేశం

దళిత సామాజిక కార్యకర్త యాదాల శ్రీనివాస్, ఐకెపీ కమ్యూనిటీ సర్వేయర్ మరియు సత్తుపల్లి మండల తహసీల్దార్‌పై పూర్తి ఆధారాలతో కూడిన ఫిర్యాదును జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమర్పించారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ APCR/BP/TG/2026/324178 నంబర్‌తో కేసు నమోదు చేసి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీస్ కమిషనర్‌కు 30 రోజుల్లోగా పూర్తి వివరాలతో కూడిన ఎస్సీ /ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ వివాదానికి నాంది నవంబర్ 2, 2025న పడింది. సత్తుపల్లి మండలానికి చెందిన ఐకెపీ కమ్యూనిటీ సర్వేయర్ తన ఇష్టానుసారం కొమ్మేపల్లి రెవెన్యూ గ్రామంలో నిర్వహించిన సర్వేలో దళితుల భూములపై అక్రమ సర్వేలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి రాగా అదే సమయంలో ఆయన ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తూ, అక్కడ సెలవు పెట్టి సత్తుపల్లి మండలంలోని కొమ్మేపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వేలు నిర్వహించారని సమాచారం వుందీ.ఈ అక్రమాలపై హైకోర్టులో కంటెంప్ట్ కేసులు నమోదైనట్లు, దళిత సామాజిక కార్యకర్త యాదాల శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు మానవ హక్కుల కమిషన్‌లో 2025 నవంబర్ 4న ఆధారాలతో హాజరు కావాలని ఫిర్యాదుదారుడికి మరియు అసిస్టెంట్ సర్వే డైరెక్టర్లకు నోటీసులు జారీ అయినట్లు వివరాలు 2025 నవంబర్ 2న ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురితమయ్యాయి.

Advertisement

Also Read: Dharmavaram: రాష్ట్రంలో వింత కేసు.. భర్త ప్రియుడిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య, అసలేం జరిగిందంటే..?

మానవ హ‌క్కుల క‌మిష‌న్‌లో పిర్యాదు

ఈ అంశాలు నేటికీ(High Court for the State of Telangana) హైకోర్ట్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ పరిధిలోనే ఉన్నట్లు పేర్కొనబడింది. ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయిన మూడు నెలల తరువాత, దళిత సామాజిక కార్యకర్తపై ప్రతీకార చర్యల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మండల తహసీల్దార్, ఐకెపీ కమ్యూనిటీ సర్వేయర్ కలిసి కావాలనే తప్పుడు ఫిర్యాదు చేశారనే ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.“వార్తల్లో వచ్చిన వివరాలు ఫాల్స్ న్యూస్. సమాజంలో తన ప్రతిష్ఠ దెబ్బతింటోంది, ఉద్యోగానికి భంగం కలుగుతోంది” అంటూ ఐకెపీ కమ్యూనిటీ సర్వేయర్ మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేశారని, దాని ఆధారంగా సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలోని కీలక వాస్తవాలు మానవ హక్కుల కమిషన్‌లో నమోదైన కేసులు, దళితుల భూములపై అక్రమ సర్వేలు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కంటెంప్ట్ కేసులు, (R&R)ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ వ్యవహారం, హైకోర్టు స్టే ఆర్డర్ వంటి అంశాలను ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ద‌ళిత కుటుంబాన్ని మాన‌సికంగా హింసించారు

Advertisement

ఆ ఫిర్యాదు ఆధారంగానే దళిత సామాజిక కార్యకర్తపై ఎఫ్ఐఆర్ (Crime No.34/2026) నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ లో అత్యంత సంచలనకర అంశం ఏమిటంటే దళిత సామాజిక కార్యకర్తతో పాటు నాలుగేళ్ల క్రితమే మరణించిన ఆయన తండ్రి పేరును కూడా చేర్చడం. ఇది కేవలం పరిపాలనా పొరపాటు కాదని, ప్రశ్నించే దళిత కుటుంబాన్ని మానసికంగా కుంగదీసే ప్రయత్నమని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఈ ఎఫ్ఐఆర్ ను చూపిస్తూ ఐకెపీ కమ్యూనిటీ సర్వేయర్ సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే దళిత ఉద్యోగులను బెదిరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఫిర్యాదుదారుల వాదన ప్రకారం, దళితుల హక్కుల కోసం నిలదీసినందుకే ప్రతీకార చర్యలు జరిగాయని, చట్ట ప్రక్రియను ఆయుధంగా మార్చి బెదిరింపు వాతావరణం సృష్టించారని, మృతుడి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం అమానవీయ చర్యగా భావిస్తూ తహసీల్దార్ దాచిన అన్ని కీలక వాస్తవాలు ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉన్నాయని కూడా వారు పేర్కొన్నారు.

అందరి దృష్టి అటువైపే.. ?

ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఖమ్మం పోలీస్ కమిషనర్‌కు జారీ చేసిన నోటీసులో, సంబంధిత అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ పూర్తి వివరాలు, అరెస్టుల స్థితి, చార్జ్‌షీట్ పురోగతి, అలాగే ఎస్సీ/ఎస్టీ ( ప్రివెన్షన్ ఆఫ్ ఎక్ట్రాసిటీస్ యాక్ట్ వర్తింపజేయాల్సిన అంశాలపై సమగ్ర నివేదికను 30 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. స్పందన లేకపోతే సమన్లు జారీ చేసే అధికారాన్ని వినియోగిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఖమ్మం జిల్లా పరిపాలన మరియు పోలీస్ శాఖ సమర్పించనున్న నివేదికపై అందరి దృష్టి నిలిచింది. ఈ ఘటన ఒక వ్యక్తి సమస్యను మించి, దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎంతవరకు రక్షణగా ఉన్నాయన్న మౌలిక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మూలాధారం కాగా, ఆ హక్కును వినియోగించినందుకు కేసులే సమాధానమా అన్న ప్రశ్నకు వచ్చే అధికారిక సమాధానమే — సత్తుపల్లి ఘటనకు తుది రూపం ఇవ్వనుంది.

Also Read: New vs Old Tata Punch EV: కొత్త, పాత టాటా పంచ్ ఈవీలో ఎది బెస్ట్? ఎందుకు?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×