E-Paper
Advertisement

Khushboo: ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఖుష్బూ.. సినిమా డీటెయిల్స్ ఇవే!

Khushboo: ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఖుష్బూ.. సినిమా డీటెయిల్స్ ఇవే!
Advertisement

Khushboo: దక్షిణాది వెండితెరపై ఒకప్పుడు వెలుగు వెలిగి, అభిమానులతో గుడులు కట్టించుకున్న నటి ఖుష్బూ (Khushboo ) వారసురాలు అవంతిక (Avantika) ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ‘ఆరంభం’ అనే మలయాళ చిత్రంతో ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. సుమారు 5.11 అడుగుల పొడవుతో, గ్లామర్‌తో పాటు నటనపై మక్కువతో సిద్ధమైన అవంతిక, తన తల్లి లెగసీని కొనసాగిస్తూ స్టార్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. అభిమానులు ఈ క్రేజీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే ..

వారసత్వపు అడుగులు.. మలయాళం నుంచి శ్రీకారం:

సినిమా ఇండస్ట్రీలో వారసుల రాక ఎప్పుడూ హాట్ టాపిక్. స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు, వారి తల్లిదండ్రుల స్థాయిని అందుకుంటారా లేదా అన్న చర్చ అందరిలో మొదలవుతుంది. తమిళనాట ఆరాధ్య దైవంగా పేరు తెచ్చుకున్న ఖుష్బూ, ప్రముఖ దర్శకుడు సుందర్.సి కుమార్తె అవంతిక ఎప్పుడు తెరపై కనిపిస్తుందా అని చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందరూ ఆమె తమిళ సినిమాతోనే పరిచయం అవుతుందని భావించారు, కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అవంతిక మలయాళ ఇండస్ట్రీని ఎంచుకున్నారు. ‘ఆరంభం’ అనే సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం కాబోతున్నారు. కేరళలోని త్రిసూర్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైన ఈ చిత్రం, అటు తమిళంలో కూడా విడుదల కానుంది.

కష్టపడి మెరిసిన అవంతిక.. తల్లి భావోద్వేగం:

Advertisement

ఇక అవంతిక సినీ ప్రవేశం అంత సులభంగా ఏమీ జరగలేదు. గతంలో తన ఎత్తు 5.11 అడుగులు ఉండటం, ఫిట్‌నెస్ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఆమె తనను తాను మలుచుకున్నారు. పట్టుదలతో శ్రమించి, మేకోవర్ అయ్యి ఇప్పుడు వెండితెరకు సిద్ధమయ్యారు. తన కూతురు కష్టాన్ని చూసిన ఖుష్బూ, సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అవంతిక ఫోటో షూట్ చూశాక, అభిమానులకు కూడా ఆమెలో ఒక స్టార్ మెరుపు కనిపిస్తోందని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో సరిత, ఇంద్రన్స్, విజయరాఘవన్ వంటి దిగ్గజ నటీనటులు కూడా నటిస్తుండటంతో, అవంతికకు ఇదొక మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

also read:Dhurandhar 2 : ధురంధర్ 2 కి భారీ షాక్.. ఏకంగా బ్లాక్ లిస్ట్ లోకి!

లెగసీని నిలబెడుతుందా? లేదా :

Advertisement

ఇక ప్రతి రంగంలో వారసులు వస్తుంటారు, కానీ ఆ స్థాయిని కాపాడుకోవడం అన్నది వారి సొంత ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. అలా ఎంతోమంది నిలబడ్డారు. ఇక ఖుష్బూ తన నటనతో, అందంతో ఒక శకాన్ని సృష్టించారు. ఇప్పుడు అవంతిక కూడా అదే దారిలో నడుస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న మలయాళ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేయడం ఆమె తెలివైన నిర్ణయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నా, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకోవడానికి అవంతిక సిద్ధమవుతున్నారు. ఈ ‘ఆరంభం’ ఆమె కెరీర్‌లో ఒక అద్భుతమైన మలుపు కావాలని ఫాన్స్ తోపాటు మనము కోరుకుందాం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×