E-Paper
Advertisement

Dhurandhar 2 : ధురంధర్ 2 కి భారీ షాక్.. ఏకంగా బ్లాక్ లిస్ట్ లోకి!

Dhurandhar 2 : ధురంధర్ 2 కి భారీ షాక్.. ఏకంగా బ్లాక్ లిస్ట్ లోకి!

Dhurandhar 2 :బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ధురంధర్. ఆదిత్యథర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఏకంగా రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సొంతం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు భారీ చర్చకు తెరలేపింది. ఇకపోతే థియేటర్ వద్ద సంచలన విజయం సాధించి హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ధురంధర్2: ది రివేంజ్’ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కూడా అంచనాలు పెంచేసింది..మార్చి 19వ తేదీన అత్యంత భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

‘ ధురంధర్2: ది రివేంజ్’ కి భారీ షాక్..

ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బీభత్సాన్ని సృష్టించడంతో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. అటు మేకర్స్ కూడా ఈ సినిమా మిగిలిన షూటింగ్ వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో తాజాగా ఈ చిత్రానికి భారీ షాక్ కు కలిగింది. ఈ సినిమా యూనిట్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా ఈ సినిమా మేకర్స్ లలో ఒకరైన బి62 స్టూడియోస్ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించుకోవడంతో బాలీవుడ్ లో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.

also read:Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు!

శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ లోకి..

అనుమతులు లేకుండా చారిత్రక కట్టడాలలో షూటింగ్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారని సదరు కార్పొరేషన్ అధికారులు చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్ లోకి చేర్చారు. అలా చేయడం వల్ల ఇకపై సదరు నిర్మాణ సంస్థ ముంబై నగరంలో ఎలాంటి షూటింగ్ లు జరపలేదు. పైగా ఆ సంస్థకు అనుమతులు కూడా లభించవు. ఏది ఏమైనా ఇలా బ్లాక్ లిస్ట్ లోకి చేర్చడం నిజంగా చిత్ర బృందానికి భారీ షాక్ అని చెప్పవచ్చు.

అసలేమైందంటే?

ఇక విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఫోర్ట్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ యదేచ్చగా జరుగుతోంది .. పురాతన కట్టడాలు అక్కడికి వచ్చే టూరిస్టులు, జనాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ నిప్పు పెట్టడం, టపాసులు పేల్చడాన్ని అధికారులు నిషేధించారు. కానీ చిత్ర బృందం మాత్రం ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ మంటలు రాజేసి షూటింగ్ చేసిందట. ఇక నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ చేస్తున్నారని గమనించిన ముంబై కార్పొరేషన్ అధికారులు జరిమానా విధించినా.. ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి మళ్లీ కాగడాలు వెలిగించి షూటింగ్ చేస్తూ టీం అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే స్టూడియోని బ్లాక్ లిస్టు లోకి పెట్టేసారు అధికారులు.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×