E-Paper
Advertisement

IAS Officer: అంతా చట్టం ప్రకారమే.. రికార్డులు క్రియేట్ చేస్తున్న ఐఏఎస్, ముచ్చటగా మూడోసారి

IAS Officer: అంతా చట్టం ప్రకారమే.. రికార్డులు క్రియేట్ చేస్తున్న ఐఏఎస్, ముచ్చటగా మూడోసారి
Advertisement

IAS Officer: పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు అవి ప్రసాద్. ఆయనొక ఐఏఎస్ అధికారి కూడా. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఆయన వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఐఏఎస్ అధికారిణి.  ఐఏఎస్ ప్రసాద్ ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన చేసేదంతా చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఆయన గురించి ఇంకాస్త లోతుగా వెళ్తే..

మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి ప్రసాద్ ముచ్చటగా మూడో పెళ్లి

Advertisement

ఉద్యోగాల్లో ఏ విభాగానికి చెందినవారు వారిని వివాహం చేసుకుంటారు. టెక్కీకి టెక్కీ.. డాక్టర్‌కి డాక్టర్, ఐఏఎస్‌కి ఐఏఎస్‌లు వివాహం చేసుకున్న సందర్భాలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. తామున్న వృత్తిలో వారిని చేసుకుంటే సమస్యలను అర్థం చేసుకుంటారని చాలామంది భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారి అవి ప్రసాద్ గురించి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఎంపీ కేడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన..  2017 బ్యాచ్ ఎంపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అంకితా ధాక్రే‌ను వివాహం చేసుకున్నారు. అందులో కొత్తేమీ లేదు. కాకపోతే ఆయన చేసుకున్న ఈ వివాహం మూడోది.

Advertisement

ఆయన మాజీ, ప్రస్తుత భార్య ఐఏఎస్ అధికారులే

షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌లో తాజా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధాక్రే మధ్యప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా సేవల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా కొనసాగుతున్నారు.  చట్టపరంగానే ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చారు.

తాజాగా మూడో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఇద్దరు భార్యలు ఐఏఎస్‌ అధికారిణులే. ఇప్పుడు చేసుకున్న ఆమె కూడా ఐఏఎస్‌ ఆఫీసరే. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన ప్రసాద్, 2013లో UPSC పరీక్షలో విజయం సాధించారు. తొలుత ఐపీఎస్‌కి ఎంపికై ఆయన, మరుసటి ఏడాది 2014లో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కి సెలక్ట్ అయ్యారు.

ప్రసాద్ తాత తంబేశ్వర్ ప్రసాద్ అలియాస్ బచ్చబాబు మాజీ ప్రధాని చరణ్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ప్రసాద్ తొలి వివాహం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి రిజు బాఫ్నాతో జరిగింది. ఢిల్లీలో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇద్దరు కలుసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ:  ప్రపంచంలో అత్యంత ధనిక గ్రామం.. ప్రతి ఇంట్లో ఓ బిలియనీర్ 

కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో సేవలందిస్తున్నారు. ఆ తర్వాత 2016 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌కు మారారు. నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయారు. మిషాసింగ్ ప్రస్తుతం రత్లాం కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వలో అనేక బాధ్యతలు చేపట్టారు ప్రసాద్. జిల్లా పంచాయతీ CEO, జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత కాట్ని కలెక్టర్‌గా పని చేశారు. ఆ జిల్లాలో పోషకాహార లోపాన్ని పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఉపాధి హామీ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వివాహ వేడుక కవరేజ్ పై ఈ జంట స్పందించలేదు. దేశంలో ముగ్గురు IAS అధికారులను ఒకరి తర్వాత మరొకర్ని వివాహం చేసుకున్న మొట్టమొదటి, ఏకైక IAS అధికారి ప్రసాద్.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×