E-Paper
Advertisement

SEYON Film glimpse: శివ కార్తికేయన్ సేయోన్ గ్లింప్స్… సినిమా కథ ఇదేనా..

SEYON Film glimpse: శివ కార్తికేయన్ సేయోన్ గ్లింప్స్… సినిమా కథ ఇదేనా..
Advertisement

SEYON Film glimpse: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈయన పరాశక్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా శివ కార్తికేయన్ మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు. ఇటీవల శివ కార్తికేయన్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈయన ‘సేయోన్’ (Seyon) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా పట్ల మంచి అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.

సేయోన్ అంటే అర్థం ఏంటీ?

ఈ గ్లింప్స్ వీడియో చూస్తుంటే శివ కార్తికేయన్ సాంప్రదాయ పద్ధతిలో ధోతీ కట్టుకొని, విభూతి రుద్రాక్షలతో కనిపిస్తూనే, చేతిలో కాగ‌డా ప‌ట్టుకుని ఊగిపోతున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు. ఇలా ఈయన లుక్ చూస్తుంటే శివ కార్తికేయన్ తమిళులు ఎంతగానో ఆరాధించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశతో ఈ సినిమా మొత్తం ముడిపడి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఈ ఫస్ట్ గ్లింప్స్ తోనే స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాకు ‘సేయోన్’ అనే టైటిల్ పెట్టడంతో అసలు ఈ పేరుకు అర్థమేంటంటూ కూడా చాలామంది ఆరా తీస్తున్నారు. తమిళంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ‘సేయోన్’ అని కూడా పిలుస్తారు అదేవిధంగా ‘సేయోన్’ అంటే రాజు అని అర్థం కూడా ఉంది.

కమల్ హాసన్ బ్యానర్ లో సేయోన్..

Advertisement

ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ చిత్రాన్ని 2026 దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు శివకుమార్ మురుగేషన్(Sivakumar Murageshan) దర్శకత్వం వహించగా కమల్ హాసన్(Kamal Hassan) తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

ఇదివరకే కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ అమరన్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తిరిగి కమల్ బ్యానర్ లో ఈ సినిమాకు కమిట్ అయ్యారు. గ్రామీణ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది అయితే ఇలా మురుగన్ పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో నటుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించక ముందే శివ కార్తికేయన్ తన సినిమాని ప్రకటించడం విశేషం.

Also Read: Dushyanth: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరొక టాలీవుడ్ హీరో.. ఘనంగా నిశ్చితార్థపు వేడుక!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×