E-Paper
Advertisement

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది
Advertisement

FIGHT BETWEEN MIKE HESSON AND SHAHEEN AFRIDI: వన్డే ట్రై సిరీస్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు పెను ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ ( MIKE HESSON), వన్డే సారధి షాహీన్ అఫ్రిది ( SHAHEEN AFRIDI) మధ్య ప్రాక్టీస్ సమయంలో పెద్ద గొడవ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బౌలింగ్‌పైన కాకుండా, బ్యాటింగ్ పైనే షాహీన్ అఫ్రిది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడని మైక్ హెసన్ మందలించినట్టు సమాచారం. బౌలింగ్ పైనే ఫోకస్ చేసి, ముందుకు వెళ్లాలని సూచించినట్టు చెబుతున్నారు. కెప్టెన్ గా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై శ్రద్ధ పెట్టాలంటూ హితువు పలికినట్టు సమాచారం.

నా జోలికి వస్తే, తాట తీస్తా… మైక్ హెసన్‌కు షాహీన్ అఫ్రిది వార్నింగ్

అయితే, కోచ్ మైక్ హెసన్ సూచనలను షాహీన్ అఫ్రిది బేఖాతరు చేశాడని అంటున్నారు. తనకు నచ్చిన పని చేస్తానని, నీకేం నొప్పి అంటూ ఎదురు తిరిగినట్టు ప్రచారం సాగుతోంది.  నువ్వు కేవలం కోచ్‌వు మాత్రమే కెప్టెన్ వు కాదంటూ కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు. తనకు నచ్చిన పని తాను చేస్తాను..ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ అవమానించాడని కథనాలు వస్తున్నాయి. అనవరసంగా తన బుర్ర తింటే, మాత్రం చేతికి పని చెప్పాల్సి వస్తుందని హెచ్చరించాడని అంటున్నారు. దీంతో అక్కడి నుంచి అలిగి, డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారట కోచ్ మైక్ హెసన్. ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సంఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెంటనే సీరియసై, షాహీన్ ను మందలించినట్టు సమాచారం.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ ట్రై సిరీస్ షెడ్యూల్

పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ ట్రై సిరీస్ షెడ్యూల్ ఇప్పటికే ఫైనల్ అయింది. ఈ మూడు జట్ల మధ్య ఆదివారం అంటే అక్టోబర్ 18వ తేదీ నుంచి వన్డే ట్రై సిరీస్ షురూ కానుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ వర్సెస్ లంక జట్ల ఆదివారం తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మూడు జట్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన జట్లు ఫైనల్స్ కు చేరతాయి.

Advertisement

అక్టోబర్ 31వ తేదీన లహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ సిరీస్ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్తాన్ దేశంలోని ఇంగ్లాండ్ ప్లేయర్లు అడుగు పెట్టారు. నిన్న లండన్ లో విమానం ఎక్కిన ఇంగ్లీష్ ఆటగాళ్లు, ఇస్లామాబాద్ లో దిగారు. అక్కడే ఓ ప్రముఖ హోటల్ లో బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. ఎక్కడ బాంబులు పడతాయో, ఎవడూ దాడి చేస్తాడోననే భయంలో ఉన్నారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×