T20 WORLD CUP 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 world cup 2026) నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే బంగ్లాదేశ్ వైదొలిగింది. ఇక ఇప్పుడు ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి తప్పుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) చేసిన ప్రకటన చూస్తే ఇదే విషయాన్ని సూచిస్తోంది. తమ పాకిస్తాన్ ( Pakistan ) ప్రభుత్వం అనుమతి ఇస్తేనే, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడదామని మొహ్సిన్ నఖ్వీ సంచలన ప్రకటన చేశారు. దీంతో టి20 ప్రపంచ కప్ నుంచి వైదొలగాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ డిమాండ్లను నెరవేర్చని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్ ( Pakistan Boycott) చెప్పే ప్రయత్నం చేస్తుందట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) సంచలన ప్రకటన చేశారు. వరల్డ్ కప్ లో పాల్గొనడం పై పాకిస్తాన్ సర్కార్ అనుమతి ఇస్తేనే అందులో పాల్గొంటామని వెల్లడించారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదని వివరించారు. పాకిస్తాన్ ప్రధాని నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడుతామని క్లారిటీ ఇచ్చారు మొహ్సిన్ నఖ్వీ. మా ప్రభుత్వం ఎలా చెబితే అలా వింటామని వెల్లడించారు. ఒకవేళ తమ ప్రభుత్వం ఆడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇస్తే… ఐసీసీ మరో జట్టును తీసుకోవాల్సి ఉంటుంది..
అప్పుడు 22వ జట్టు కోసం ఐసీసీ ప్రయత్నాలు చేయాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్తాన్ కూడా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటుందని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. అదే సమయంలో ఇండియా పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మొహ్సిన్ నఖ్వీ. ఐసీసీ ప్రతిసారి ఇండియాకు నచ్చినట్లుగానే వ్యవహరిస్తోంది.. ఇతర జట్ల డిమాండ్లను అస్సలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇండియాకు అవసరం అనుకుంటేనే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి… బంగ్లాదేశ్ డిమాండ్లను ఒకటి కూడా నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. ఇలా ఐసీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. ఇకనైనా ఇండియాకు ఫేవర్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని సూచనలు చేశారు మొహ్సిన్ నఖ్వీ. టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన నేపథ్యంలో కొత్త స్కాట్లాండ్ కు ఛాన్స్ లభించింది. ఇక ఈ దెబ్బకు బంగ్లాదేశ్ కు రూ.240 కోట్ల నష్టం జరిగిందట.
🚨 PAKISTAN OUT OF THE T20 WORLD CUP 🚨
– Mohsin Naqvi is waiting for Pakistan’s PM confirmation on whether to play or boycott the T20 World Cup 2026 😯
– After Bangladesh's exit, Pakistan is also preparing to boycott the WC 🧐
– What's your take 🤔pic.twitter.com/OicthJkFhG
— Richard Kettleborough (@RichKettle07) January 24, 2026