E-Paper
Advertisement

Border 2 OTT : మూడు దశాబ్దాల తర్వాత తెరపైకి వచ్చిన సీక్వెల్ ‘బోర్డర్ 2’… ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లాక్

Border 2 OTT : మూడు దశాబ్దాల తర్వాత తెరపైకి వచ్చిన సీక్వెల్ ‘బోర్డర్ 2’… ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లాక్
Advertisement

Border 2 OTT  : ఇండియన్ సినిమా హిస్టరీలో కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది 1997 లో వచ్చిన ‘బోర్డర్’ సినిమా. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘బోర్డర్ 2’ (Border 2) 2026 జనవరి 23న థియేటర్లలో రిలీజ్ అయింది. సన్నీ డియోల్ మళ్లీ మేజర్ రోల్‌లో ఇంటెన్స్ ప్యాట్రియాటిక్ వార్ డ్రామాగా సూపర్ హిట్ అవుతోంది ఈ మూవీ. డైరెక్టర్ అనురాగ్ సింగ్ తీసిన ఈ మూవీకి, ఇప్పటికే థియేటర్లలో మంచి కలెక్షన్స్ చేసి, ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ దుమ్మురేపేలా ఉన్నాయి ఇందులో. బ్రేవ్ హార్ట్స్, లెగసీ కంటిన్యూ అనే ట్యాగ్‌లైన్‌తో ఫుల్ దేశభక్తి ఫీల్ ఇస్తుంది ఈ సినిమా. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ అంటే

ఈ ఇంటెన్స్ యాక్షన్ ‘బోర్డర్ 2’ లో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా, సోనమ్ బజ్వా, మోనా సింగ్, మేధా రాణా, అన్య సింగ్ కూడా సహాయక పాత్రల్లో నటించారు. దీనిని టి-సిరీస్ ఫిల్మ్స్, జెపి ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, జెపి దత్తా, నిధి దత్తా నిర్మించారు. ఈ వార్ యాక్షన్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ పొందింది. అయితే స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఆఫీషియల్ అనౌన్స్ కాలేదు. కానీ ఇండస్ట్రీ ట్రెండ్స్ ప్రకారం థియేటర్లలో 4-6 వీక్స్ తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. తెలుగు డబ్ వెర్షన్ అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు థియేటర్లలో చూడని వాళ్ళు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మరికొంత సమయం వేచి చూడక తప్పదు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా 1971 భారత-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. 1997లో వచ్చిన ‘బోర్డర్’ కేవలం ‘లాంగేవాలా యుద్ధం’పై దృష్టి పెడితే, ఈ సీక్వెల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి చేసిన పోరాటాన్ని చూపిస్తుంది. నేషనల్ వార్ అకాడమీలో ముగ్గురు స్నేహితులు హోషియార్ సింగ్ (వరుణ్ ధావన్), నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ (దిల్‌జిత్ దోసాంజ్), మహేంద్ర సింగ్ రావత్ (అహాన్ శెట్టి) కలుసుకోవడంతో మొదలవుతుంది. వీరికి లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కలేర్ (సన్నీ డియోల్) గురువుగా ఉండి శిక్షణ ఇస్తారు.

ఈ సమయంలో 1971లో పాకిస్తాన్ ‘ఆపరేషన్ చంగీజ్ ఖాన్’ పేరుతో భారత వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో యుద్ధం మొదలవుతుంది. నిర్మల్ జిత్ సింగ్ పెళ్లి వేడుకల్లో ఉన్న ఈ ముగ్గురు స్నేహితులు తక్షణమే తమ విధుల్లో చేరాలని ఆదేశాలు అందుతాయి. యుద్ధరంగంలో వీరు ప్రాణాలకు తెగించి ఎలా పోరాడారు ? తమ గురువు ఫతే సింగ్ మార్గదర్శకత్వంలో శత్రువులను ఎలా అడ్డుకున్నారు ? అనేది మిగిలిన కథ.

Advertisement

Read Also : గణతంత్ర దినోత్సవానికి ముందు ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన 5 మలయాళ వార్ డ్రామాలు

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×