RC17 Movie:పుష్ప సిరీస్ తర్వాత సుక్కు చరణ్ తో సినిమా అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కూడా అయితే . ఆ సినిమాలో చరణ్ నటనకు, సుకుమార్ టేకింగ్‌కు ఎంత పేరు వచ్చిందో.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి కూడా అంతే మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఒక్కసారిగా దేవిశ్రీ పేరు డిబేట్ లోకి వచ్చేసింది.
రామ్ చరణ్ 17వ సినిమాగా ప్రచారంలో ఉన్న RC17కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటారా? లేక సుకుమార్ ఈసారి మరో సంగీత దర్శకుడికి అవకాశం ఇస్తారా? అనే ప్రశ్నలు ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .ఇక ఈ విషయంపైనే తాజాగా నిర్మాత రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడిన ఆయన.. దేవి చాలా గొప్ప సంగీత దర్శకుడని, ఆయనలో ఇంకా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చే సత్తా ఉందని చెప్పారు. ఇండియాను ఊపేసే పాటలు అందించే కెపాసిటీ దేవీ సొంతం అని చెప్పుకొచ్చారు .
నిజానికి దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెల్సిందే .. వీళ్లిద్దరూ కలిసి పనిచేసిన సినిమాల్లో పాటలు ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకున్నాయి మరి .ముఖ్యంగా రంగస్థలం సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలామందికి ఫెవరెట్ కూడా . ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ స్టార్ డం కొట్టేసాడు . ఆ సినిమాలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ ఎసెట్ గా నిలిచిపోయాయి.అందుకే రామ్ చరణ్ సినిమాకు కూడా దేవిశ్రీ సంగీతం అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మెగా ఫాన్స్.
అయితే RC17 మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇంకా ఎలాంటి ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ లండన్‌లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే సినిమా గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు ఇతర టెక్నీషియన్ల ఎంపిక కూడా ఇంకా ఫైనల్ కాలేదని వివరించారు. ఒకవేళ ఈ సినిమాకు మరో సంగీత దర్శకుడిని తీసుకున్నా, దాన్ని దేవిశ్రీ ప్రసాద్‌ను తక్కువ చేసినట్టుగా చూడకూడదని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడన్న మాట .
ఇక ఈ క్రమంలోనే దేవిశ్రీ ప్రసాద్‌తో తమ సంస్థకు మంచి అనుబంధం ఉందని ఆయనతో కలిసి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, పుష్ప, పుష్ప 2, ఉప్పెన వంటి సినిమాలు చేశామని తెలిపారు. ఈ సినిమాలకు దేవిశ్రీ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు. దేవిశ్రీ తమకు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదని, కుటుంబ సభ్యుడిలాంటి వ్యక్తి అని చెప్పడం ఇక్కడ విశేషం .సుకుమార్‌కు కూడా దేవిశ్రీ సొంత తమ్ముడిలాంటి వాడని చెప్పడం బట్టి చూస్తే వీళ్ల మధ్య ఇగో క్లాష్ అన్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపిస్తుంది.
మరోవైపు రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుండే క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్ .
రంగస్థలం తర్వాత వీళ్లిద్దరూ కలిసి జోడీ కట్టడంతో ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఉంటే సినిమా స్థాయి మరోలా ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ వదలడం ఇక్కడ గమనార్హం.మొత్తానికి RC17లో దేవిశ్రీ ప్రసాద్ ఉంటారా లేదా అనే విషయం సుకుమార్ తిరిగి వచ్చిన తర్వాతే తేలనుందన్న మాట !
Also read:మధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్..కమ్‌బ్యాక్ అదిరిపోయిందిగా!