E-Paper
Advertisement

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?
Advertisement

King 100:‘కింగ్ 100’… నాగార్జున అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అప్ డేట్ త్వరలో వచ్చేందుకు రంగం సిద్దమయింది.అవును. నాగార్జున కెరీర్‌లో వందో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్న సంగతి తెల్సిందే.

ఇప్పటికే ఇందులో నాగ్ ఎలాంటి రోల్ లోకనిపించబోతున్నాడు? స్టోరీ ఎలా ఉండబోతోంది? ఇక ఇందులో కనిపించే క్యాస్టింగ్ ఎవరంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.ఇపుడు వెయిటింగ్ ఈజ్ ఓవర్ అంటూ దసరా సందర్భంగా ఓ స్పెషల్ అప్‌డేట్ వదిలేందుకు సిద్ధమయ్యారు మూవీ లవర్స్.

Advertisement

‘కింగ్ 100’పై భారీ అంచనాలు

ఇక ఈ ‘కింగ్ 100’ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే.మరో వైపు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు. నాగార్జున, టబు నాగ్ తో కలిసి నటిస్తున్నానని ఇప్పటికే అనౌన్స్ చేసింది కూడా.గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆ సినిమాలో నాగ్, టబు మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్ కూడా.ఇక అలాంటి ఈ జోడీ చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటంతో ‘కింగ్ 100’పై అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి.

Advertisement

బాలీవుడ్‌లోనూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్

ఇక టబు కూడా తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పక్కర్లేదు.కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్‌లోనూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉండటం విశేషం. కేవలం అందంతోనే కాకుండా, నటనతోనూ ప్రేక్షకులను మెప్పించగలడం ఆమె స్పెషాలిటీ.ముఖ్యంగా ఎమోషన్స్ టబు బాగా పండిస్తుందన్న పేరుంది.దాంతో ఇప్పుడు నాగార్జున వందో సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, దసరా సందర్భంగా టబు పాత్రకు సంబంధించిన ఓ స్పెషల్ అప్‌డేట్‌ను వదిలేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అయితే టబు పాత్ర ఏంటి? నాగార్జునతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంటుంది? కథలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది అప్ డేట్ తర్వాతే తెలిసే అవకాశం ఉంది.

సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి !

ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి చెప్పక్కర్లేదు. మరి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందా ,నాగ్, టబు జోడీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది?అన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి !

ALSO READ :‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

Tags

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×