Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇట్లు అర్జున(Itlu Arjuna) సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula) నిర్మాతగా మారి నిర్మించిన ఇట్లు అర్జున సినిమా నాగార్జున (Nagarjuna) సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా వారి నుంచి వెంకీ కుడుములకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
ఇట్లు అర్జున సినిమా అక్టోబర్ 2న రావాల్సి ఉండగా ఒక సినిమా కారణంగా వాయిదా వేస్తూ అక్టోబర్ 9కి ప్లాన్ చేశారు. ఇప్పుడు అక్టోబర్ 30వ తేదీ విడుదల అవుతుంది. అదేరోజు ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbham) కూడా రాబోతుందని వార్తలు వస్తున్నాయి మరి ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ అయితే మీ సినిమా విడుదల అవుతుందా? లేదా అంటూ ప్రశ్న ఎదురయింది. ఇలా మీడియా వారు వెంకీ కుడుములకు ఈ ప్రశ్న వేయడంతో నాగార్జున (Nagarjuna)మైక్ అందుకొని కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించి దాదాపు ఒకటిన్నర నెల అయింది. రెండో తేదీ విడుదల చేయాలనుకుంటే ఒక పెద్ద సినిమా కోసం వాయిదా వేశారు.
ఇక అక్టోబర్ 9వ తేదీ ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు తీరా చూస్తే ఆ పెద్ద సినిమా విడుదలవుతుందని చెప్పడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అక్టోబర్ 30 అంటున్నారు. కనీసం ఇప్పుడైనా వాయిదా పడకుండా రావాలని నేను కోరుకుంటున్నాను అంటూ నాగార్జున తెలిపారు. ఒక సినిమా విడుదల తేదీని ప్రకటిస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా అదే రోజున సినిమా విడుదల చేయాలి అలా కాని నేపథ్యంలో విడుదల తేదీని ప్రకటించకూడదని నాగార్జున తెలిపారు. నాగార్జున ఇలా సినిమా విడుదల గురించి చురుకలు అంటించడంతో కచ్చితంగా అది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం సినిమా గురించేనని స్పష్టమవుతుంది.
ఈయన నటిస్తున్న కింగ్ 100 సినిమా గురించి కూడా స్పందిస్తూ తన సినిమాని డిసెంబర్ 24వ తేదీ ప్రకటించాను. ఈ సినిమాని చెప్పిన తేదీని విడుదల చేయాలనే సంకల్పంతో రాత్రి పగలు కష్టపడుతూ షూటింగ్ పూర్తి చేస్తున్నామని నాగార్జున తెలిపారు. ఒక సినిమా విడుదల తేదీ ప్రకటించాము అంటే నెల రోజులు ముందుగానే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవాలని అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ నాగార్జున తెలిపారు. ఇలా నాగార్జున రిలీజ్ డేట్లను మార్చడం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి.
Also Read: వీకే నరేష్ విగ్గు ధర ఎంతో తెలుసా? ఒక ఫ్యామిలీ లగ్జరీగా బ్రతకొచ్చుగా?