E-Paper
Advertisement

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం
Advertisement

ULC Fraud: నకిలీ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) క్లియరెన్స్‌ లేఖలతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించిన కేసులో ముగ్గురిని సూరారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 192, 193లో ఉన్న ప్లాట్లకు సంబంధించి నకిలీ యూఎల్‌సీ క్లియరెన్స్‌ లేఖలను కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించారు. వీటి ఆధారంగా ఈ ఏడాది జూన్‌ 4న రెండు సేల్‌ డీడ్లు రిజిస్ట్రేషన్‌ చేశారు.

నకిలీ పత్రాలు తయారీ..

అనంతరం పత్రాల ప్రామాణికతను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. ఈ వ్యవహారంలో జాదవ్‌ సుధాకర్‌ (39), నారాయణదాసు శివాచారి అలియాస్‌ శివ (57), చిట్టిమిల్ల బాలరాం (64)లను పోలీసులు అరెస్టు చేశారు. యూఎల్‌సీ క్లియరెన్స్‌ ఇప్పిస్తామని నమ్మించి, ప్రభుత్వ అధికారుల సంతకాలు, ముద్రలను అనుకరిస్తూ నకిలీ పత్రాలు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం రూ.6 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

మరెవరైనా ఉన్నారా..?

Advertisement

నిందితుల నుంచి 17 పత్రాలు, ఐదు రబ్బరు స్టాంపులు, ఐదు స్టాంప్‌ ప్యాడ్లు, గ్రీన్‌ పెన్‌, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా ? ఇతర ఆస్తులకూ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగాయా ? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ జోన్‌ డీసీపీ కోటి రెడ్డి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.

Also read: ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

Tags

Related News

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న ఆరు కార్లు, హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన

కరువును ఎదిరించి.. ఎండిన పొలాలను తడిపి.. చిన్నమాధారం అన్నదాతల భగీరథ ప్రయత్నం!

Big Stories

Advertisement
×