E-Paper
Advertisement

Kiran abbavaram: కిరణ్ అబ్బవరం ‘అతి’కి పరాకాష్ట.. ఒక్క హిట్ రాగానే డైరెక్షన్ పిచ్చా?

Kiran abbavaram: కిరణ్ అబ్బవరం ‘అతి’కి పరాకాష్ట.. ఒక్క హిట్ రాగానే డైరెక్షన్ పిచ్చా?
Advertisement

Kiran abbavaram: టాలీవుడ్‌లో కొందరు హీరోలకు ఒక్క హిట్ తగిలితే చాలు.. తామేదో జేమ్స్ కామెరాన్ అయిపోయినట్లు ఫీలవుతుంటారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం తీరు కూడా అలాగే ఉందంటూ ఫిలిం నగర్ గుసగుసలాడుతోంది. నటుడిగా ఇంకా ఓనమాలు కూడా పూర్తిగా నేర్చుకోకముందే, ఇప్పుడు ఏకంగా ‘డైరెక్టర్’ క్యాప్ పెట్టుకుంటాననడం చూస్తుంటే.. అబ్బవరం గారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

హీరోగా ఫెయిల్ అవుతున్నాడనే భయమా?
వరుస డిజాస్టర్లతో కెరీర్ క్లోజ్ అయిపోతుందనుకున్న టైమ్‌లో ‘క’ సినిమా కిరణ్‌ను గట్టెక్కించింది. నిజానికి ఆ సినిమా ఆడింది అందులోని కంటెంట్ వల్ల తప్ప, కిరణ్ అబ్బవరం నటన వల్ల కాదన్నది చేదు నిజం. ఆ క్రెడిట్ అంతా దర్శకులకే వెళ్లాలి. కానీ, కిరణ్ మాత్రం ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకుని, ఇప్పుడు తానే ఒక భారీ సినిమాను డైరెక్ట్ చేస్తానంటూ మేకర్స్‌ను ఇబ్బంది పెడుతున్నాడట. ‘హీరోగా మార్కెట్ ఎప్పుడైనా పడిపోవచ్చు.. అందుకే ఇప్పుడే డైరెక్టర్ ముద్ర వేయించుకుందాం’ అనే ప్లాన్ లో ఉన్నాడా? అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

స్క్రిప్టుల్లో వేలు పెట్టడం చాలదా?
ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం గురించి ఒక బ్యాడ్ టాక్ ఉంది.. అదేంటంటే, తనతో సినిమా చేసే ఏ దర్శకుడిని కూడా ఆయన ప్రశాంతంగా పని చేయనివ్వడని, ప్రతి సీన్ లోనూ వేలు పెడతాడని టాక్. ఇప్పుడు ఏకంగా తానే డైరెక్టర్ అంటే, ఇక సెట్స్ మీద మిగతా టెక్నీషియన్ల పరిస్థితి ‘అగమ్యగోచరం’ అన్నమాట. తన సినిమాలకు తానే ప్రొడ్యూసర్, తానే హీరో, ఇప్పుడు తానే డైరెక్టర్.. అంటే ఇక మిగతా వాళ్ళు అక్కడ ఎందుకు? కేవలం అబ్బవరం గారి భజన చేయడానికేనా?

భీమ్స్ లాంటి హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌తో రిస్క్
ఈ సినిమాకు హిట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోను తీసుకుంటున్నారట. అసలే భీమ్స్ ఇప్పుడు టాప్ ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టుకుని, కిరణ్ అబ్బవరం డైరెక్షన్ ప్రయోగాలు చేయడం అంటే.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్‌ను కూడా రిస్క్‌లో పడేయడమే. నటుడిగా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది కొండంత ఉంటే, ఈ డైరెక్షన్ పిల్లిమొగ్గలు ఎందుకు? అన్నది సినీ విశ్లేషకుల ప్రశ్న.

Advertisement

అతి సర్వత్ర వర్జయేత్
గతంలో చాలా మంది హీరోలు ఇలాగే ‘నేనూ డైరెక్టర్‌నే’ అని ఫీలయ్యి చేతులు కాల్చుకున్నారు. కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న టైమ్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే స్వయంకృతాపరాధమే. కిరణ్ అబ్బవరం నటుడిగా దృష్టి పెడితే మంచిది, లేదంటే డైరెక్టర్ అవ్వాలనే పిచ్చితో అటు హీరోగా ఉన్న గుర్తింపు కూడా పోగొట్టుకోవడం ఖాయం!

also read: మైత్రీ మూవీ మేకర్స్ ‘డ్రామా’.. ‘ఉస్తాద్’ రేట్ల వెనుక అసలు గుట్టు రట్టు

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×