E-Paper
Advertisement

‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!

‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!
Advertisement

Anasuya NEET: దేశ వ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్న నీట్ ఇష్యూపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని ఎంతో మంది ప్రముఖులు స్పందించిన సంగతి తెల్సిందే.అయితే ఈ ఇష్యూ పై ఇప్పటి వరకు ఒక్క మంచు లక్ష్మి, ఆదిత్య ఓం తప్ప మరో తెలుగు సినీ సెలెబ్రెటి స్పందించింది లేదు.దీంతో ఇప్పటికే అసలు తెలుగు స్టార్స్ అంతా ఏమైపోయారు.దేశంలో ఇంత జరుగుతున్నా కనీసం నోరు తెరవరా అంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది కూడా.

ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం లో చాలా లూప్ హోల్స్

Advertisement

అయితే నేనున్నాచోచ్ అంటూ ఎంట్రీ ఇచ్చింది వెటరన్ బ్యూటీ అనసూయా భరద్వాజ్.ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని,అయితే గత ప్రభుత్వాల హయాంలో చాలా సార్లు పేపర్ లీకేజీలు అయ్యాయ్ కాబట్టి ఇప్పుడు కూడా అలాగే లీక్ అయి ఉంటుంది లే అని ఈజీగా తీసుకోవడానికి లేదని,అప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదని, కానీ ఇప్పుడు చాలా మారిపోయిందని చెప్పుకొచ్చింది.ఓపిక అనేది నశిస్తుందని అందరికీ తెలుసని, ఎప్పటికైనా సిస్టం మారుతుందని ఆశ పడుతుంటాం కాని ఇక ఎప్పటికీ మారిపోదని అర్థం అయ్యాక ఇలాగె ఓపిక నశించి ఎదురు తిరుగుతారని తేల్చి చెప్పింది.

చిన్నప్పుడు గోచీలు ఇప్పుడెందుకు వేసుకోవట్లేదు

Advertisement

అయితే అప్పుడెందుకు రియాక్ట్ అవలేదు ఇప్పుడెందుకు రియాక్ట్ అయ్యారు అని ఎవరైనా అడిగితె అది బుద్ది తక్కువ పనే అవుతుందని చెప్పుకొచ్చింది.ఎడ్యుకేషన్ సిస్టం గురించి మాట్లాడితే ఆయన అప్పుడు అలా అన్నారు కాదా, ఈయన ఇప్పుడు అన్నారు అంటే అది చిన్నప్పుడు గోచీలు వేసుకున్నాం కదా ఇప్పుడెందుకు వేసుకోవట్లేదు అని అడిగినట్టు ఉంటుందని సెటైర్ వేసింది.దీన్ని బట్టి సగం,సగం నాలెడ్జ్ తో మాట్లాడడం ఆపేయాలని,ఇకనైనా తలాతోకా లేకుండా వాగొద్దని ఉచిత సలహా ఇచ్చేసింది.

అనసూయ పేరు చెబితే చాలు

ఇక అనసూయ పేరు చెబితే చాలు క్లిక్స్ వస్తాయని,వ్యూస్ పెరుగుతాయని అందుకే అందరు తనని సెంటర్ చేస్తూ తిడతారని ఒక రకంగా అది నా గ్రేట్ నెస్ అని,కాని మీరు మామీద పడి బతికే పరాన్న జీవులు అనకపోతే ఇంకేం అంటారని అంటూ నెటిజన్లకి రిటార్ట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సోనం వాంగ్ ఛుక్ దీక్ష చేపట్టిన పర్పస్ సగం ఫుల్ అయిందని చెప్పుకొచ్చింది.

also read:మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !

అయితే ఇదే వీడియోలో ఈ అక్కలంతా రాలేదు ఏంటో అంటూ కొంతమంది పై సెటైర్స్ వేసింది.ఏదైనా పోలో మంటూ పరిగెత్తే ఆ అక్కల సపోర్ట్ 99 పర్సెంట్ వారికి ఉంటుందని తాను ఎంతగానో ఆశపడ్డానని కాని వాళ్ళు మాత్రం తనని డిసప్పాయింట్ చేశారని చెప్పుకొచ్చింది.ఆడవాళ్ళ అనాటమీ గురించి, వాళ్ళ ఇష్టా ఇష్టాల గురించి నేను మాట్లాడితే ఎంతో రచ్చ చేశారు,అలాంటి అక్కలు ఇపుడు ఎటు పోయారని,మరో వైపు ప్రజల కోసమే తామున్నామంటున్న ఛానల్స్ ఎటు పోయాయని కౌంటర్ వేసింది .

దీంతో అనసూయ సెటైర్ వేసిన ఆ అక్కలు,చానల్స్ ఎవరా అంటూ ఇపుడు ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. చూడాలి మరి నీట్ పై ధైర్యం చేసి మాట్లాడిన అనసూయకి ఎలాంటి సెగ తగులుతుందో !

Related News

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..? 

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!

Big Stories

Advertisement
×