E-Paper
Advertisement

ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేస్తావ్ జగన్?.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్!

ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేస్తావ్ జగన్?.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్!
Advertisement

BC Welfare: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో బీసీలను అణగదొక్కి, అక్రమ కేసులతో వేధించి నేడు బీసీ గర్జన ఏ ముఖం పెట్టుకొని పెడతావ్ జగన్ అని ఫైర్ అయ్యారు. తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, అమర్నాథ్‌ గౌడ్‌లతో పాటు 74 మంది బీసీల హత్యలను జగన్ పట్టించుకోలేదని అన్నారు. హత్య చేసిన నిందితులు జైలు నుంచి వస్తే ఘనంగా ఊరేగింపులు చేశారని అన్నారు.

అక్రమ కేసులు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కోత కోశారు. 50 శాతం ఉన్న బీసీల్లో ఒక్కరూ కూడా యూనివర్సిటీ వీసీలుగా పనికి రాలేదా జగన్? శ్రీకాళహస్తిలో లోకేష్‌ను పలకరించిందనే కోపంతో రజక సోదరి బడ్డీ కొట్టును ధ్వంసం చేశారని అన్నారు. ఐదేళ్లు జగన్ రెడ్డి బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించి, ఇబ్బందులకు గురి చేశాడని, చంద్రబాబు కేబినెట్‌లో రెవెన్యూ, హెల్త్, వ్యవసాయం, ఎక్సైజ్, మైనింగ్ వంటి కీలక శాఖలను బీసీలకు ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు.

Advertisement

Also read: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్, పిన్ లేకుండానే పేమెంట్స్.. ఫోన్ అలా ట్యాప్ చేస్తే చాలు!

రూ.50 వేల కోట్లు..

సీదిరి అప్పలరాజు తన కుమారుడిని కాపాడుకునేందుకు యాదవ సోదరుడి చావుకు కారణమయ్యారు. సొంత కోడలిని అదనపు కట్నం కోసం వేధించిన నీచ స్వభావం జోగి రమేశ్‌ది. వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవాన్ని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ దెబ్బతీశాడు. బీసీల సంక్షేమం కోసం రూ.50 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నామని అన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని తేబోతున్నాంమన్నారు.

మైనింగ్‌లో 33 శాతం..

Advertisement

54 వేల మంది చేనేత కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయబోతున్నామని, గీత కార్మికులకు వైన్స్, బార్‌లలో 10 శాతం, వడ్డెరలకు మైనింగ్‌లో 33 శాతం కేటాయించి ఆర్థికంగా చేయూతనిస్తున్నామన్నారు. దెబ్బతిన్న బీసీ హాస్టళ్లను పునరుద్ధరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. బలహీన వర్గాలను మరోసారి మోసం చేసేందుకే బీసీ గర్జన పేరుతో జగన్ డ్రామాలు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Also Read: ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోదీయే.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

Related News

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

Big Stories

Advertisement
×