Singer Sid Sriram Body Guards Salary Details: సింగర్ సిద్ శ్రీరామ్ తో పాట అంటే నిర్మాతలు ఎగబడుతుంటారు. తమ సినిమాల్లో సిద్దు పాట ఉండాల్సిందే అని పట్టుబట్టి పాడించుకునేవారు. కానీ, ఇప్పుడు మాత్రం బాబోయ్ అంటున్నారు. సిద్ శ్రీరామ్ తో పాట అంటే మేకర్స్ గుండెలు పట్టుకున్నారట. అతడు స్టూడియోకి వస్తే నిర్మాతల జేబులకు చిల్లులేనట. దీనికి కారణం అతడి రెమ్యునరేషన్ కాదు.. బాడీగార్డ్స్ జీతమట. సిద్ శ్రీరామ్ కి బాడీగార్డ్స్ ఏంటి అని షాక్ అవుతున్నారట. అవును.. సిద్ శ్రీరామ్ నలుగురు బాడీగార్డ్స్ ని నియమించుకున్నాడట. అతడు ఎక్కడికి వెళ్లిన వారు ఉండాల్సిందేనట. సిద్ధూ సినిమా పాట పాడటానికి వస్తే.. బాడీగార్డ్స్ కి భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సిందేనట. దీంతో నిర్మాతలు ఇప్పుడు సిద్ శ్రీరామ్ పేరు వింటే బాబోయ్ అంటున్నారట. ఇంతకి అసలు విషయం ఏంటంటే..
బాబోయ్.. సిద్ శ్రీరామ్ తో పాట..
సిద్ శ్రీరామ్ ఈ మధ్య తన కోసం నలుగురు బాడీగార్డ్స్ ని నియమించుకున్నాడు. తాను ఎక్కడికి వెళ్లిన ఆ నలుగురు ఉండాల్సిందే. నిజానికి సిద్ శ్రీరామ్ కు బాడీగార్డ్స్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సినిమా పాట పాడాలంటే సింగర్స్ స్టూడియోకి వస్తే సరిపోతుంది. వారు సెట్స్ కి కూడా రావాల్సిన అవసరం లేదు. స్టూడియోకి వచ్చి వెళ్లిపోయేదానికి బాడీగార్డ్స్ అవసరం లేదు. కానీ, సిద్ధూ మాత్రం స్టూడియోకి వచ్చేటప్పుడు నలుగురు బాడీగార్డ్స్ వెంటబెట్టుకుని వస్తున్నాడట. వారికి గంటకు మూడు లక్షల వరకు చెల్లిస్తున్నాడట. ఆ ఆర్థిక భారాన్ని కూడా నిర్మాతలపైనే వేస్తున్నాడట.
బాడీగార్డ్స్ జీతం రూ. 15 లక్షలు
ఇటీవల ఓ సినిమాలో పాట పాడేందుకు స్టూడియోకి వచ్చిన అతడ అక్కడ 5 గంటల వరకు ఉండాల్సి వచ్చిందట. దీంతో తన రెమ్యునరేషన్ తో పాటు తన బాడీగార్డ్స్ పారితోషికం కూడా భారీగా తీసుకున్నాడట. వారికి గంటకు రూ. మూడు లక్షల చొప్పున 5 గంటలకు రూ. 15 లక్షలు తీసుకున్నాడట. దీంతో సదరు మూవీ నిర్మాత షాక్ అయ్యాడు. అతడి పారితోషికంతో పాటు అతడి బాడీగార్డ్స్ జీతం కూడా నిర్మాతపైన వేయడం ఇప్పుడంత సిద్ శ్రీరామ్ ని పేరు వింటనే భయపడుతున్నారు. అతడితో పాట అంటేనే నిర్మాతలు బాబోయ్ అటున్నారట. నిజానికి సిద్ శ్రీరామ్ లాంటి సింగర్ కి బాడీగార్డ్స్ అవసరం లేదు.
సిద్దూ కి బాడీగార్డ్సా!
అయినా కూడా వారిని మెయింటెన్ చేస్తూ.. నిర్మాతలపై మరింత ఆర్థిక భారం మోపుతున్నాడు. ఇలా అయితే సిద్ధు శ్రీరామ్ కు ఆఫర్స్ రావడం కష్టమే అంటున్నారు. ఇప్పటికే అతడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా అయితే మిగతా భాషల్లోనూ అతడిని పట్టించుకునేవారు ఉండకపోవచ్చు అని సినీ సర్కిల్లో చర్చించుకుంటున్నారు. కాగా 2013లో సిద్ శ్రీరామ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రమఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన కదల్ ఆడియోకు సిద్ధు తన గాత్రం అందించాడు. ఈ ఆడియోతో అతడి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. అలా సిద్ధు శ్రీరామ్ సింగర్ గా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత తమిళ, తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో పాటలు పాడాడు.
Also Read: Hari Hara Veeramallu : నార్త్‌లో సనాతనిని వాడుకోవడం లేదా.. రత్నం గారు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు