Telusu Kada Movie : ఓ భారీ బడ్జెట్ మూవీ, పీరియడికల్ బ్యాగ్రౌండ్ లేదా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే, దానికి వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువ చేయాల్సి ఉంటే.. ఆ సినిమాను పూర్తి చేయడానికి రెండేళ్ల కంటే ఎక్కువ పడుతుంది. కానీ, సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న తెలుసు కదా మూవీ స్టార్ట్ అయి.. దాదాపు 22 నెలలు అవుతుంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. బడ్జెట్ పెరుగుతూనే ఉంది. కానీ, సినిమా షూటింగ్ మాత్రం ముందుకు జరగడం లేదు.
అప్పుడు కాస్టూమ్స్ కోసం రీ షూట్స్ ?
గతంలో ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వచ్చింది. హీరోకు కాస్టూమ్స్ నచ్చలేదని చాలా వరకు రీ షూట్స్ పెట్టుకున్నారట. దీంతో హీరో తో పాటు కాస్ట్ అండ్ క్రూ అందరూ ఎక్స్‌ట్రా డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందట. అలాగే నిర్మాత అనుకున్న బడ్జెట్ కూడా దాటిపోయిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఎంత వరకు నిజం ఉందో హీరో సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నీరజ కోనా, నిర్మాతలు పీపిల్ మీడియా ఫ్యాక్టరీకే తెలియాలి.
ఇప్పుడు 50 లక్షలతో స్పెషల్ సాంగ్ ?
ఇప్పుడు మళ్లీ ఇదే మూవీపై ఇండస్ట్రీలో ఓ గాసిప్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ, సినిమా షూటింగ్ ను పక్కన పెట్టి ఓ సాంగ్ చేస్తున్నారట. దాదాపు 50 లక్షలతో ఆ సాంగ్ షూట్ చేస్తున్నారట. దీని కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ సిద్ శ్రీ రామ్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారట.
సినిమాలో సాంగ్ ఉండదా… దానికి 50 లక్షలు పెడితే తప్పు ఏంటి అని అనుకోవచ్చు. కానీ, 50 లక్షలతో చేస్తున్న ఆ సాంగ్ సినిమాలో ఉండే సాంగ్ కాదట. కేవలం యూట్యూబ్ లో రిలీజ్ చేయడానికి మాత్రమే ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ప్రమోషన్స్ లో మాత్రమే ఈ సాంగ్ యూజ్ చేస్తారట. అసలు సినిమా కథకు ఈ సాంగ్ కు ఎలాంటి సంబంధం కూడా లేదట. అలాంటి సాంగ్ కోసం ఏకంగా 50 లక్షలు ఖర్చు చేస్తున్నారట.
ఈ విషయం బయటికి తెలియడంతో… 50 లక్షలు పెట్టి ఓ సాంగ్ షూట్ చేయడం ఏంటి..? నిర్మాతలు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా ఈ మూవీకి అనే ప్రశ్నలు వస్తున్నాయి. యూట్యూబ్ లో మాత్రమే రిలీజ్ చేసే సాంగ్ అయితే… ఏదో చిన్నగా చేసి మమా అనిపించాలే గానీ, ఇంత భారీగా ఖర్చు పెట్టడం ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రమోషన్స్ స్టైల్ వీళ్లకు తెలీదా ?
సినిమాలను ప్రమోట్ చేయడానికి ఇలా లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఖర్చు లేకుండా… సినిమా కంటెంట్ తో ప్రమోషన్స్ చేయడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ చేయడంలో ఓ ట్రెండ్ సెట్ చేశాడు. దీన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు.
నిర్మాతలకు భారం కాకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రమోట్ అయ్యేలా చాలా ఐడియాలు చెప్పాడు అనిల్. దాన్ని ఫాలో అవ్వకుండా, యూట్యూబ్ లో మాత్రమే రిలీజ్ చేసే సాంగ్ కోసం ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటో అని అంటున్నారు.