BDL Recruitment: హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అనే చెప్పవచ్చు. హైదరాబాద్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా లేదా డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), హైదరాబాద్ యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 17వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో్ పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, హెచ్ఆర్, ఫైనాన్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్ పోస్టులు వెెకెన్సీ ఉన్నాయి.
ట్రైనీ ఇంజినీర్ : 100 పోస్టులు
ట్రైనీ ఆఫీసర్: 12 పోస్టులు
డిప్లొమా అసిస్టెంట్: 90 పోస్టులు
ట్రైనీ అసిస్టెంట్: 10 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విబాగంలో డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. అర్హతలు ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 17
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 10
వయస్సు: 2025 ఆగస్టు 10వ తేదీ నాటికి 28 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్ ఉద్యోగాలకు రూ.29వేల నుంచి రూ.38వేల వరకు జీతం ఉంటుంది. డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్ పోస్టులకు రూ.24,500 నుంచి రూ.29,500 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bdl-india.in/recruitments
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 212
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 10
ALSO READ: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. లైఫ్ సెట్ భయ్యా.. జస్ట్ ఇది ఉంటే చాలు