BigTV English

Hari Hara Veeramallu : నార్త్‌లో సనాతనిని వాడుకోవడం లేదా.. రత్నం గారు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు

Hari Hara Veeramallu : నార్త్‌లో సనాతనిని వాడుకోవడం లేదా.. రత్నం గారు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు


No Promotions For HHVM in Bollywood: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’. దీంతో ఈ మూవీపై విపరీతమైన బజ్ ఉంది. కానీ, ఆ క్రేజ్ ను మూవీ టీం పెద్ద వాడుకోవడం లేదేమో అనిపిస్తుంది వారి తీరు చూస్తుంటే. పాన్ ఇండియా సినిమా, అందులోనూ పవన్ కళ్యాణ్ చిత్రమంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి. కానీ, ఆ హడావుడే కనిపించడం లేదు. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే దేశంవ్యాప్తంగా పర్యటిస్తూ తన మూవీస్ ప్రమోట్ చేస్తున్నారు. కానీ, హరి హర వీరమల్లు టీం మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉంది. ఇతర రాష్ట్రాల్లో కాదు కదా.. కనీసం తెలుగులోనూ పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఏఎం రత్నం షాకింగ్ కామెంట్స్

ఇలాంటి టైంలో నిర్మాత ఏఎం రత్నం చేసిన ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని మరింత ఉడికిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలి. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రమోషన్స్ ధూం ధామ్ అనేలా కనిపించాలి. కానీ, ఈ విషయంలో మూవీ టీం ఎందుకు సైలెంట్ గా ఉందో అర్థం కావడం లేదు. ఇప్పటికే కాస్తా నెగిటివ్ ప్రచారంలో ఈ మూవీని ట్రైలర్ నిలబెట్టింది. దాన్ని క్యాచ్ చేసుకుని మూవీ కాస్తా గట్టిగా ప్రమోషన్స్ చేస్తుందేమో అనుకున్నారు. కానీ, ఎక్కడ కూడా మూవీకి సంబంధించి ఈవెంట్ కానీ, హీరోహీరోయిన్ల ఇంటారాక్షన్ కనిపించడం లేదు. సరే సౌత్ లో లేకపోయిన.. కనీసం నార్త్ లో అయిన గట్టి ప్రచారం చేస్తారంటే ఇప్పుడు బాలీవుడ్ లో అసలు ఈవెంట్ ఉండే అవకాశం లేదంటున్నారు నిర్మాత ఏఎం రత్నం.

నార్త్ లో పవన్ క్రేజ్ ఇలా

ఉత్తరాధిన పవన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. డబ్బింగ్ చిత్రాలతో ఇప్పటికే నార్త్ ఆడియన్స్ కాస్తా పరిచయం ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక వారికి మరింత దగ్గరయ్యారు. అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి హిందీలో గుర్తింపు పొందారు. కానీ, పవన్ మాత్రం రాజకీయాలతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో కూటమీతో కలిసి పోటీ చేయడం, ఆ టైంలో మోదీ సపోర్టు గట్టిగా ఉండటంతో పవన్ పేరు నార్త్ లో బాగా వినిపించింది.  ఆ తర్వాత మహారాష్ట్ర వంటి స్టేట్స్ లో బీజేపీ కి మద్దతుగా వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ బిజేపీ విజయం సాధించింది. దీంతో నార్త్ లో ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థమైపోతుంది. అదే సమయంలో పవన్ కు నార్త్ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిందనడంలో సందేహం లేదు.

హిందీపై కామెంట్స్

ఇటీవల హిందీ భాష.. మన రాజ భాష అంటూ నార్త్ ప్రజల మనసు గెలుచుకున్నారు. మాతృ భాష అమ్మ… రాజ భాష హిందీ పెద్దమ్మ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలతో పవన్ హిందీలో చేరగని ముద్ర వేసుకున్నారు. మరోవైపు ఉత్తరాధి ప్రజలు నమ్మో.. సనాతన ధర్మానికి ఆయన పాటు పడుతున్నారు. ఇలా తన శైలితో పవన్ నార్త్ ప్రజల ఆకట్టుకున్నారు. దీంతో ఆయనకు అక్కడ భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అలాంటి ఉత్తరాధి భారతంలో హరి హర వీరమల్లు మూవీ ప్రమోషన్స్ లేకపోవడం ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. పవన్ క్రేజ్ పై నమ్మకమా? లేక కంటెంట్ పై ఉన్న బలయో కానీ, ప్రమోషన్స్ కి టీం కాస్తా దూరంగా ఉంటుంది. బాలీవుడ్ లో ఈవెంట్ పెట్టకపోయినా.. నిర్మాతగా తాను వెళ్లి ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు ఏఎం రత్నం.

ప్రస్తుతం ఇటూ రాజకీయాలు,అటూ సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. ప్రమోషన్ లో పాల్గొనే అవకాశం లేదు. ఇక ప్రెస్ మీట్ లకు ఆయన దూరమనే విషయం తెలిసిందే. మూవీ లీడ్ రోల్స్ లో హీరోయిన్ తో కలిసి ప్రెస్ మీట్స్ కు సిద్ధమవుతున్నారు. నిధి అగర్వాల్ మార్కెట్ సౌత్ వరకే పరిమితం. అది కూడా అంతంత మాత్రమే. నిధి బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అలాంటి ఆమెతో అక్కడ ప్రమోషన్స్ చేస్తే ఎంత వరకు ప్లస్ అవుతుందో నిర్మాతకే తెలియాలి. నార్త్ లో గట్టిగా ప్రమోషన్స్ చేసి పవన్ కు ఉన్న ఫాలోయింగ్ ని మూవీ టీం ప్లస్ చేసుకుంటుందనుకుంటే.. అసలే ఈవెంట్సే ఉండవు అంటున్నారు.ఇది మూవీ టీం మైనస్ అనే చెప్పాలి. మరి ఎలాంటి ప్రమోషన్స్ లేకండ వీరమల్లు నార్త్ లో ఎలాంటి మార్కెట్ చేస్తాడో చూడాలి. కాగా హరి హర వీరమల్లు మూవీ జూలై 24న వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది.

Related News

Ilaiyaraaja : మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Big Stories

×