E-Paper
Advertisement

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Suriya Scene Movie: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సూర్య ఒకరు ఈయన పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకు విపరీతమైన ఆదరణ ఉంది. సూర్య నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదల అవుతూ ఇక్కడ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకు సూర్య తన సినీ కెరియర్లో 46 సినిమాలను విజయవంతంగా విడుదల చేశారు ఇక త్వరలోనే తన 47వ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

దీపావళి బరిలో సూర్య సీన్ మూవీ..

సూర్య తన 47వ సినిమాని ఆవేశం సినిమా డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో సూర్య జోడిగా నజ్రియా హీరోయిన్ పాత్రలో సందడి చేయబోతున్నారు ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఒకగ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు వెరైటీగా “సీన్ ” అని టైటిల్ ప్రకటించారు అదేవిధంగా ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ ఆరవ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఇండియన్ మోస్ట్ అవైటెడ్ చిత్రం రామాయణం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంఘటన తెలిసి తెలిసిందే.

జ్యోతిక నిర్మాతగా సీన్ మూవీ..

Advertisement

ఇలా సూర్య రామాయణ సినిమాతో పోటీకి సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సూర్య వైఫ్ జ్యోతిక నిర్మాతక వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే . ఇక మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా సూర్య సరైన సక్సెస్ సినిమాలు లేక ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారు. కానీ ఈ ఏడాది ఈయన వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. సూర్య నటించిన కరువు సినిమా మే 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా తెలుగులో వీరభద్రుడు అనే పేరిట విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇకపోతే తాజాగా సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకీ అట్లూరి డైరెక్షన్లో తిరిగిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఏకంగా తెలుగులో 260 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి సీన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ద్వారా సూర్య ఎలాంటి సక్సెస్ అందుకుంటారు ఈ సినిమాతో మరో 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టే సీన్ సూర్యకు ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా నవంబర్ 6న విడుదల కాబోతున్నట్లు తెలియచేశారు. అనుకున్న విధంగానే విడుదల అవుతూ రామాయణ సినిమాకు పోటీగా వస్తుందా లేదంటే వెనకడుగు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: యాంకర్ గా తొక్కేయడంతోనే ఉదయభాను నిర్మాత అయ్యారా?

Related News

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×