Udaya Bhanu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ అంటే ఒకానొక సమయంలో అందరికీ ఉదయ భాను పేరు గుర్తుకు వచ్చేది. ఇలా ఉదయభాను యాంకర్ గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించారు అలాగే పలు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహిస్తూ బిజీగా గడిపారు అయితే ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి కొత్త యాంకర్లు వస్తున్న నేపథ్యంలో ఉదయభానుపు అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా తనకు అవకాశాలు లేకపోవడం గురించి ఉదయభాను పలు సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకరింగ్ సిండికేట్ నడుస్తుందని, తద్వారా తనకు వచ్చిన అవకాశాలు తనకు తెలియకుండానే చేజారిపోయేవి అంటూ గతంలో కూడా ఈమె ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశం గురించి మరోసారి ఉదయభాను మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉదయభాను నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉదయభాను ప్రొడక్షన్ లో “పంచనామా” అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి జీ 5 లో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభానుకు యాంకరింగ్ విషయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.
ఒకానొక సమయంలో యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఉదయభానుకు యాంకర్ గా అవకాశాలు లేకపోవడం వల్లే ఇలా నిర్మాతగా మారారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు ఉదయభాను సమాధానం చెబుతూ తనకు యాంకర్ గా అవకాశాలు లేక నిర్మాతగా ఇటువైపు రాలేదని చెప్పారు. తాను గతంలో కూడా కొన్ని సీరియల్స్ అలాగే షోస్ ప్రొడ్యూస్ చేశానని తెలిపారు. తనకు సినిమాలలోకి కూడా రావాలని ఎప్పటినుంచో ఉండేదని అయితే కొన్ని కారణాలవల్ల తన నిర్మాణ సంస్థను ప్రారంభించడం ఆలస్యమైందని తెలిపారు. తాను నిర్మాతగా సినిమాలు వెబ్ సిరీస్ లు చేయడం కోసం చాలా కథలు విన్నానని ఉదయభాను తెలిపారు.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన జర్నీ గురించి కూడా తెలిపారు. చిన్నప్పటినుంచి మైక్ చేత పట్టుకొని స్వయం కృషితో తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటరిగా నిలబడి పోరాటం చేశానని తెలిపారు. అయితే మీకు టాలెంట్ ఉన్నప్పటికీ ఎవరు అవకాశాలు ఇవ్వకపోతే కచ్చితంగా ఉదయభాను ప్రొడక్షన్ హౌస్ మీ కోసం తలుపులు తెరిచే ఉంటుందని మీ టాలెంట్ తో అద్భుతమైన కథను తీసుకొస్తే కచ్చితంగా అలాంటి ప్రాజెక్టులు చేస్తామని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె బాలకృష్ణ దాదా సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు ఈ సినిమాలో ఉదయభాను నటించబోతుందంటూ వార్తలు రావడంతో అలాంటిదేమీ లేదని తెలిపారు.
Also Read: బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!