E-Paper
Advertisement

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?
Advertisement

Police Jobs: స్వేచ్ఛ బ్యూరో: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్ధుల వయో పరిమితిని పెంచాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యం, నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల చాలా మంది నిరుద్యోగులు వయో పరిమితి మించిపోయి, అర్హత కోల్పోతున్నారని వివరించారు.

వయో పరిమితి..

ఈ నేపథ్యంలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితిని,కానిస్టేబుల్ ఉద్యోగానికి వయో పరిమితి 34 ఏండ్ల నుంచి 36 ఏండ్ల వరకు,ఎస్సై ఉద్యోగానికి వయో పరిమితి 37 ఏండ్ల నుంచి 38 ఏండ్ల వరకు వయో పరిమితి పెంచాలని కోరారు.నిరుద్యోగుల అభర్థన పై సానుకూలంగా స్పందించిన సీఎం..అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ తెలిపారు.

Advertisement

Also read: యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

లాంగ్ జంప్ తగ్గించండి.. 

ఇక పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ లాంగ్ జంప్ ఈవెంట్స్ బుధవారం శాసనమండలి సమావేశంలో ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ మాట్లాడారు.పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సమస్యను సభ దృష్టికి దృష్టికి తీసుకొచ్చారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 7437 పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పిన బల్మూర్ వెంకట్…4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనను 3.8 మీటర్లకి తగ్గించాలని కోరారు.పక్క రాష్ట్రం ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో లాంగ్ జంప్ క్వాలిఫై 3.8 మీటర్లుగానే పరిగణిస్తున్నారని గుర్తు చేశారు.మన రాష్ట్రంలోనూ పోలీసు నియామకాల ఈవెంట్స్ లో 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనతో చాలా మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేకపోతున్నారని తెలిపారు.తమ అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలించి, లాంగ్ జంప్ నిబంధనను 3.8మీటర్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Also read: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?

సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

Big Stories

Advertisement
×