E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!
Advertisement

Music Director Deva:చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర దుఃఖానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సింగీతం శ్రీనివాసరావు కన్నుమూసి అభిమానులను ఆశ్చర్యపరచగా.. అటు నానా పటేకర్ కూడా గుండెపోటుతో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం అంటూ పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ప్రముఖ వెటరన్ సంగీత దర్శకులు దేవనేసన్ చొక్కలింగం కన్నుమూశారు. 75 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు.

మ్యూజిక్ డైరెక్టర్ దేవా కన్నుమూత..

చిత్ర సీమలో మ్యూజిక్ డైరెక్టర్గా తనదైన సంగీతంతో ప్రత్యేక ముద్ర వేసిన దేవా.. శుక్రవారం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చెన్నైలోని మైలాపూర్ లో జన్మించిన దేవా.. తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం భాషల్లో ఏకంగా నాలుగు వందలకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తొలిసారి 1986లో వచ్చిన మాట్టుక్కార మన్నన్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నటించిన వైగాసి పొరంధాచ్చు అనే సినిమాతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది.

Advertisement

ALSO READ:హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

దేవా సంగీతం అందించిన తెలుగు చిత్రాలు..

ఇకపోతే దేవా తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితులే ఎన్నో అద్భుతమైన చిత్రాలలో పాటలకు సంగీతం అందించి.. తిరుగులేని డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. తొలిప్రేమ, మాస్టర్, ఆటో డ్రైవర్ , నాగ , పంచతంత్రం , బాషా , ప్రేమ లేఖ ఇలా ఎన్నో చిత్రాలకు సంగీతం అందించారు.. దేవా తన సోదరుడు చంద్రబోస్ తో కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ ను కూడా నడిపేవారు. తమిళ్ సినిమాలో గానా పాటలు అనగానే ముందుగా దేవా నే గుర్తొచ్చేవారు. అంతలా తన మార్క్ క్రియేట్ చేశారు. ఇళయరాజా వంటి సంగీత దర్శకులు కూడా ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలో తనదైన ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్ లో సుదీర్ఘకాలం పాటు సొంత సామ్రాజ్యాన్ని ఏలారు. అలాంటి ఈయన ఆకస్మిక మరణం చెందడం అభిమానులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సెలబ్రిటీలు , ప్రముఖులు , అభిమానులు ఈయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

దేవా వారసులు..

Advertisement

కోలీవుడ్ సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్గా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దేవా.. తన వారసుడ్ని కూడా ఇండస్ట్రీ వైపే అడుగులు వేయించారు. ఇక దేవా తనయుడు శ్రీకాంత్ దేవా కూడా మ్యూజిక్ డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. ఇకపోతే దేవా చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవకుగాను కలైమామణి అవార్డు ఆయనను వరించింది.

Related News

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

Big Stories

Advertisement
×