IRCTC Ticket Booking: రైలు టికెట్ బుక్ చేసుకునే ముందు సీట్లు అందుబాటులో ఉన్నాయో? లేదో? తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదంటే రైల్ వన్ యాప్ ను ఉపయోగించవచ్చు. జర్నీ డేట్, వెళ్లాల్సిన స్టేషన్లు, రైలు, క్లాస్ ను సెలెక్ట్ చేసుకుని సీట్ల అవైలబులిటీని తెలుసుకోవచ్చు. ఇంతకీ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ప్రయాణించాలనుకుంటున్న తేదీ, నిర్దిష్ట రైలులో మీకు కావాల్సిన తరగతిలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ వివరాల్లో కన్ఫర్మ్ టికెట్లు, వెయిటింగ్ లిస్ట్ లాంటి స్టేటస్లు కనిపిస్తాయి. టికెట్ బుక్ చేసిన తర్వాత చెక్ చేసే పీఎన్ఆర్ స్టేటస్కు, బుకింగ్కు ముందు చూసే సీట్ల అవైలబులిటీకి తేడా ఉంటుంది. అందువల్ల టికెట్ కొనుగోలు చేసే ముందే సీట్లకు సంబంధించి వివరాలను తెలుసుకోవడం మంచిది. ఇంతకీ సీట్లను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1.ముందుగా అధికారిక IRCTC వెబ్సైట్ లేదంటే యాప్ ఓపెన్ చేసి మీ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
2.జర్నీ ప్రారంభించే స్టేషన్, దిగాలనుకున్న స్టేషన్ వివరాలను ఎంటర్ చేయాలి.
3.ప్రయాణించాలనుకుంటున్న డేట్ ను సెలెక్ట్ చేసుకుని రైళ్ల కోసం సెర్చ్ చేయాలి.
4.అందుబాటులో ఉన్న రైళ్ల లిస్టులో మీకు అనుగుణంగా ఉండే రైలును సెలెక్ట్ చేసుకోవాలి.
5.స్లీపర్, ఏసీ లాంటి క్లాస్ లను చెక్ చేయాలి.
6.ఎంచుకున్న తేదీ, తరగతికి సంబంధించిన సీట్ల అవైలబులిటీ, టికెట్ ఛార్జీలను చెక్ చేయండి.
7.మీకు అనుకూలంగా ఉంటే ‘బుక్ నౌ’ ఆప్షన్ ను క్లిక్ చేసి టికెట్ బుకింగ్ ప్రాసెస్ ను కంటిన్యూ చేయాలి.
టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సీట్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే విషయంతో పాటు రైలు బయలుదేరే సమయం, డెస్టినేషన్ కు చేరుకునే సమయాన్ని కూడా చెక్ చేయాలి. ఇతర రైళ్లను అందుకోవాల్సి ఉన్నా, ముందుగా హోటల్ బుక్ చేసుకున్నా ఈ డీటైల్స్ ఉపయోగపడుతాయి. అంతేకాదు, ట్రావెల్ క్లాస్ ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. స్లీపర్, ఏసీ తరగతుల ఛార్జీలు, సౌకర్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక తరగతిలో బెర్త్ లు అందుబాటులో ఉన్నా, మరో తరగతిలో వెయిటింగ్ లిస్ట్ ఉండవచ్చు.
రైళ్లలో సీట్ల లభ్యత ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొత్త బుకింగ్స్, క్యాన్సిలేషన్స్ కారణంగా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య మారుతుంది. సో, చెక్ చేసిన సమయంలో కనిపించిన వివరాలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. మీకు నచ్చిన రైలులో సీట్లు లేకపోతే ప్రత్యామ్నాయ రైళ్లు, ఇతర క్లాస్ లను లేదంటే వేరే తేదీలను పరిశీలించడం మంచిది. ఇలా ముందే సీట్ల లభ్యతను చెక్ చేసుకోవడం వల్ల అనవసరమైన ఇబ్బందులు తగ్గి, ప్రయాణానికి తగిన టికెట్ను సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
Read Also: అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!