E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!
Advertisement

Singer Krishnaraj Ramasamy:చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను మరింత దుఃఖానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ప్రముఖ సంగీత దర్శకులు దేవా (Deva)తుది శ్వాస విడవగా.. ఆయన మరణాన్ని మరువకముందే ఆయన సోదరుడి కొడుకు కార్తీక్(Karthik) 37 సంవత్సరాల వయసులోనే అనారోగ్యం బారినపడి తుది శ్వాస విడిచాడు. ఇక ఈ ఇద్దరి మరణాన్ని మరువకముందే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో దిగ్గజ గాయకుడు కన్నుమూయడం ఇండస్ట్రీని తీవ్ర దుఃఖంలో ముంచేసింది. మరి ఆయన ఎవరు? ఎలా మరణించారు? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ సంగీత నేపథ్య గాయకుడు మృతి..

ఆయన ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కృష్ణరాజ్ రామస్వామి (Krishnaraj Ramasamy). తమిళ చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కృష్ణరాజ్ రామస్వామి గత కొంతకాలంగా మహమ్మారి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు కావడం గమనార్హం. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దేవా, ఆయన తమ్ముడి వారసుడు కార్తీక్ చనిపోయిన వారంలోపే కృష్ణరాజ్ మృతి చెందడం కోలీవుడ్ ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దేవాతో కృష్ణరాజ్ కలసి ఎన్నో చిత్రాలకు పనిచేశారు.

3వేలకు పైగా పాటలు..

Advertisement

కృష్ణరాజ్ రామస్వామి తన సినీ కెరియర్లో సుమారుగా 300 కు పైగా పాటలు పాడారు. ఇందులో 300 సినిమా పాటలు కూడా ఉన్నాయి. 1990 లలో సంగీత దర్శకుడు దేవా స్వరపరిచిన ఎన్నో పాటలను పాడి విశేష గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తంజావూరు మన్ను ఎ, వెళ్లరిక్కా పింజు వెళ్లరిక్కా, తిరుపతి ఏలుమలై వెంకటేశా వంటి పాటలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1997లో విడుదలైన పొర్కాలం చిత్రంలోని తంజావూరు మన్ను ఎ పాటకు తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నేపథ్య గాయకుడి పురస్కారం లభించింది.

కృష్ణరాజు రామస్వామి తొలి జీవితం..

తమిళనాడులోని సేలం జిల్లా వేంపడితాళం ప్రాంతంలో 1951 డిసెంబర్ 25న జన్మించారు. ఈయన కుటుంబం చేనేత వృత్తితో జీవనం సాగించేది. చిన్ననాటి నుండే సంగీతంపై ముక్కువ పెంచుకున్న ఈయన స్థానిక సంగీత బృందాలతో కలిసి పాటలు కూడా పాడేవారు. ఇక సంగీతంలో శిక్షణ పొందేందుకు చెన్నై వెళ్లిన రామస్వామి.. అక్కడ సంగీత రంగంలో అనుభవం సంపాదించి, ఆ తర్వాత సినీ నేపథ్య గాయకుడిగా ఎదిగారు.

Advertisement

also read:బోల్డ్ అవతార్ లో కీర్తి సురేష్.. రాధిక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్.. ‘అక్క’ ట్రైలర్ రిలీజ్!

మ్యూజిక్ డైరెక్టర్ దేవా చిత్రాలతో మంచి గుర్తింపు..

కృష్ణరాజ్ నేపథ్య గాయకుడిగా తన ప్రస్థానాన్ని దేవా సంగీతం అందించిన చిత్రాల ద్వారానే ప్రారంభించారు. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడిన ఈయన.. జానపద శైలి, ఉత్సాహభరితమైన గీతాలు, భావోద్వేగభరితమైన పాటలు పాడడంలో ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

Related News

విజయ్ దేవరకొండకు ఇంకా ఎంత రావాలంటే.. రణబాలి లెక్క ఇదే!

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?

సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

Big Stories

Advertisement
×