E-Paper
Advertisement

ఫీవర్ హాస్పిటల్‌లో సంచలన సెమినార్.. ఈ లక్షణాలను గుర్తించకపోతే ప్రాణాపాయమే!

ఫీవర్ హాస్పిటల్‌లో సంచలన సెమినార్.. ఈ లక్షణాలను గుర్తించకపోతే ప్రాణాపాయమే!
Advertisement

Malaria Awareness: స్వేచ్ఛ బ్యూరో: నేడు వరల్డ్ మలేరియా డే ను పురస్కరించుకుని, మలేరియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ఏడాది పొడువున ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమాలను చేపడుతున్న జీహెచ్ఎంసీ శనివారం వరల్డ్ మలేరియా డే సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లు, సర్కిల్స్ కవరయ్యేలా మొత్తం 21 ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 10 గంటల వరకు రకరకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో, ఇండ్లలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలోనన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నారు.

తార్నాక సర్కిల్ పదరిధిలో..

ఇందులో భాగంగా సికిందరాబాద్ జోన్ లోని కవాడిగూడ సర్కిల్ పరిధిలోని దోమల గూడ సర్కిల్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ, అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ తెలిపారు. మెట్టుగూడ సర్కిల్ లోని మెట్టుగూడ జంక్షన్ లో కూడా ర్యాలీ, అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తార్నక సర్కిల్ పదరిధిలో బౌద్ధనగర్, సీతాఫల్ మండి వార్డుల్లోని రెడ్ క్రాస్ హాస్పిటల్ మహాగూడలో కూడా ర్యాలీ, అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నారు. అంబర్ పేట సర్కిల్ పరిధిలోని నల్లకుంటలోని సర్ రోనాల్డ్ రోస్ ఫీవర్ హాస్పిటల్ లో సెమినార్ నిర్వహించనున్నట్లు, ఈ సెమినార్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. రెడ్యానాయక్ హాజరుకానున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చార్మినార్ జోన్ లోని సంతోష్ నగర్ సర్కిల్ లో భానునగర్ నుంచి సంతోష్ నగర్ సర్కిల్ వరకు ఎంటమాలజీ సిబ్బంది పాదయాత్ర నిర్వహించి, మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

Advertisement

Also Read: అప్పుల్లో కురుకుపోయినా?.. ఈ పథకాల్లో సేవింగ్స్ కోర్టులు జప్తు చేయలేవ్.. అవేంటంటే?

అవగాహన కార్యక్రమాలు..

అలాగే మూసారాంబాగ్ సర్కిల్ లో ని ఎంసీహెచ్ కాలనీల యూపీఎస్సీ సెంటర్ వెనకా ప్రాంతంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను, అలాగే చార్మినార్ సర్కిల్ లోని తారా మైదాన్ నుంచి యూపీహెచ్ సీ పురానాపూల్ వరకు ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు, ఇదే సర్కిల్ లోని అమన్ నగర్ యూపీహెచ్ సీ నుంచి తలాబ్ కట్ట వరకు ర్యాలీ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. మలక్ పేట సర్కిల్ లోని పూసల బస్తీ సైదాబాద్ లో, యాకుత్ పురా సర్కిల్ లోని గంగానగర్, అలీనగర్ లలో కూడా ర్యాలీ, అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాజేంద్రనగర్ జోన్ లోని బుద్వేల్ విలేజ్ నుంచి సాయి కృష్ణ కాలనీ వరకు, అలాగే అత్తాపూర్ సర్కిల్ లోని వదేహి మోమోడే నుంచి చింతల్ మెట్ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

డోర్ టూ డోర్..

Advertisement

బహద్దూర్ పురా లోని జూపార్క్ నుంచి కిషన్ బాగ్ వరకు, ఫలక్ నుమా సర్కిల్ లోని ఫలక్ నుమా ఆర్టీసీ డిపో నుంచి ఇంజన్ బౌలీ వరకు, చాంద్రాయణగుట్ట సర్కిల్ లోని చాంద్రాయణగుట్ట సర్కిల్ లోని కుమ్మరి బస్తీ వరకు ర్యాలీ, జంగమ్మెట్ సర్కిల్ లోని రియాసత్ నగర్ నుంచి రక్షాపురం వరకు, గోల్కొండ జోన్ లోని గోషామహాల్ సర్కిల్ లోని ఆగపురా నుంచి యూపీహెచ్ సీ హిందీనగర్ కమ్యూనిటీ హాల్ వరకు, కార్వాన్ సర్కిల్ లోని దర్బార్ మైసమ్మ దేవాలయం నుంచి కార్వాన్ పటేల్ నగర్ వరకు ర్యాలీ తో పాటు మలేరియాపై డోర్ టూ డోర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎంఓహెచ్ వివరించారు. గోల్కొండ సర్కిల్ లోని గోల్కొండ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నుంచి కఠోరా హౌజ్ వరకు, మెహిదీపట్నం సర్కిల్ లోని మెహిదీపట్నం వార్డు ఆఫీసు నుంచి గోల్డెన్ ప్యాలెస్ వరకు, మాసాబ్ ట్యాంక్ సర్కిల్ లోని అఫ్జల్ సాగర్ యూపీహెచ్ సీ ఇందిరానగర్ నుంచి విజయనగర్ కాలనీ లేబర్ అడ్డా వరకు ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Also Read: వారెవ్వా.. ఏం ఐడియా ఓకేయాప్‌లో బస్, మెట్రో, సఫారీ టికేట్లు.. నిమిషాల్లో పని పూర్తి..!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×