Balakrishna 112: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఈ సినిమా ద్వారా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పాలి.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. శర వేగంగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని వివేక్ ఆత్రేయ(Vivek athreya ) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా NBK 112 గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. 2027వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం వివేక్ ఆత్రేయ “కురుక్షేత్రం”(Kurukshetram) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇలా ఈ సినిమా టైటిల్ కోసం కురుక్షేత్రం పరిశీలనలో ఉందనే విషయం తెలియడంతో ఈ సినిమా మహాభారతం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. మరి బాలకృష్ణ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ కి సంబంధించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాల తర్వాత బాలయ్యతో మైథాలాజికల్ సినిమా చేయబోతున్నారని స్పష్టమవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతున్నారు.
బాలయ్య సినిమా నుంచి నయనతార తప్పుకుందా?
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముందుగా హిస్టారికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు అయితే స్క్రిప్ట్ మారడంతో హీరోయిన్ కూడా మారారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: పేరుకే గ్లోబల్ బ్యూటీ.. ప్రియాంక చోప్రా గుడిలో చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!