E-Paper
Advertisement

పేరుకే గ్లోబల్ బ్యూటీ.. ప్రియాంక చోప్రా గుడిలో చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పేరుకే గ్లోబల్ బ్యూటీ.. ప్రియాంక చోప్రా గుడిలో చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Priyanka Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిక ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఒకరు. ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలో వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇలా గ్లోబల్ బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా తిరిగి ఇండియన్ సినిమాలలో భాగం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి (Varanasi) సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆలయంలో ప్లేట్లు కడిగిన ప్రియాంక చోప్రా..

ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా మరోవైపు దైవదర్శనాలకు కూడా వెళ్తూ సందడి చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ప్రియాంక చోప్రా నేడు పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్లారు. ఇలా ఈ ఆలయానికి వెళ్లిన ఈమె అక్కడ  సంప్రదాయబద్ధంగా పూజలను నిర్వహించారు. అనంతరం ప్రియాంక చోప్రా అక్కడ సేవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయంలో భక్తులు భోజనం చేసినటువంటి గిన్నెలను నేలపై కూర్చుని స్వయంగా శుభ్రం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రియాంక చోప్రా భక్తులు తిన్న ప్లేట్లు కడగడంతో ఇది కాస్త మరింత వైరల్ అవుతుంది.

గ్లోబల్ స్టార్ అయినా, సామాన్య భక్తురాలిగా..

Advertisement

ప్రియాంక చోప్రా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇలా గ్లోబల్ స్థాయిలో హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈమె తన స్టార్ డం పక్కన పెట్టి ఒక సాధారణ భక్తురాలిలాగా ఆలయంలో స్వామివారికి సేవ చేసిన నేపథ్యంలో ఈమెపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పేరుకే గ్లోబల్ బ్యూటీ కానీ ఒక సాధారణ వ్యక్తి లాగా ప్రియాంక చోప్రా వ్యవహరించారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈమె హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ భారతీయ సంస్కృతిని, భారతీయ మూలాలను మాత్రం మర్చిపోలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

?igsh=MTk2emh3bjB2YWRydQ%3D%3D

Advertisement

ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలకు కూడా దూరమైన ప్రియాంక చోప్రా కేవలం హాలీవుడ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉన్నారు.. చాలా గ్యాప్ తర్వాత ఈమె ఇండియన్ సినిమాలకు అది కూడా తెలుగు సినిమాకు కమిట్ అవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక మహేష్ బాబు హీరోగా రాబోతున్న వారణాసి సినిమాలో ప్రియాంక మందాకిని అనే కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇక ఈ సినిమా దాదాపు 50% పైగా షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. మరొక నాలుగు ఐదు నెలలలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని స్వయంగా రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాని 2027 ఏప్రిల్ ఏడో తేదీ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

Also Read : నాగ్ 100 వ సినిమా.. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న మన్మథుడు!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×