E-Paper
Advertisement

Keerthy Suresh: చాలా బాధగా ఉంది.. ఏఐ మార్ఫింగ్ ఫోటోపై కీర్తి సురేష్ ఆవేదన!

Keerthy Suresh: చాలా బాధగా ఉంది.. ఏఐ మార్ఫింగ్ ఫోటోపై కీర్తి సురేష్ ఆవేదన!
Advertisement

Keerthy Suresh: కీర్తి సురేష్ బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం హీరోయిన్ గా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా కీర్తి సురేష్(Keerthy Suresh) త్వరలోనే రివాల్వర్ రీటా (Revolver Rita)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కీర్తి సురేష్ తనకు సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోస్ పై స్పందించారు.

ఏఐ ఫోటోలపై ఆగ్రహించిన కీర్తి సురేష్..

ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని మంచి కోసం కాకుండా చెడు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీల ఫోటోలను వీడియోలను దుర్వినియోగం చేస్తున్న సంగతి తెలిసిందే. వారి ప్రమేయం లేకుండా ఇలా వారి ఫోటోలను వాడటంతో ఎంతో సెలబ్రిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహించారు. తాజాగా కీర్తి సురేష్ సైతం తన బోల్డ్ ఫోటోల గురించి స్పందిస్తూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కీర్తి సురేష్ బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఒకింత షాక్ అయ్యారు.

నేనేనా ఈ ఫోజులు ఇచ్చింది?

Advertisement

ఇలా తన పేరు మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు తాను దిగిన ఫోటోలు కాదని అవి ఏఐ(AI Photos) ద్వారా రూపొందించబడిన ఫోటోలని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు నా మనసుకు చాలా బాధ కలిగించాయి. ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలను చూసినప్పుడు నిజంగానే నేను ఇలాంటి ఫోజులు ఇచ్చానా? అని నన్ను నేనే ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్..

Advertisement

ఇలా ఏఐ జనరేటర్ ఫోటోల గురించి కీర్తి సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ సినిమాలలోను, బయట కూడా చాలా సాంప్రదాయంగా ఉంటారు తప్ప మరీ ఎక్కువగా గ్లామర్ షో చేయరనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏఐ ద్వారా ఈమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలపై కీర్తి సురేష్ ఇలా స్పందించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె రివాల్వర్ రీటా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.

Also Read: Jaya Krishna: ఘట్టమనేని వారసుడి సినిమా.. స్టార్ రంగంలోకి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్..

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×