E-Paper
Advertisement

Comedy Series OTT : యమలోకం నుండి ఎస్కేప్… అమ్మాయి బాడీలోకి గ్యాంగ్ స్టర్… కామెడీతో కడుపునొప్పి తెప్పించే

Comedy Series OTT : యమలోకం నుండి ఎస్కేప్… అమ్మాయి బాడీలోకి గ్యాంగ్ స్టర్… కామెడీతో కడుపునొప్పి తెప్పించే
Advertisement

Comedy Series OTT : వెబ్ సిరీస్ లలో కొరియన్ సిరీస్లు వేరయా అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను చూస్తే నిజమే అనుకుంటారు. అంతలా ఆకట్టుకుంటుంది ఈ డ్రామా. చనిపోయిన వాళ్లు తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్‌ను చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా చూపించారు ఇందులో. ఈ కథలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు పైలోకం నుంచి మళ్ళీ వేరే మనుషుల రూపంలోకి తిరిగివస్తారు. ఆ తరువాత కామెడీ మామూలుగా ఉండదు. ఇది కొరియాలో సూపర్ హిట్ కూడా అయింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ కొరియన్ టెలివిజన్ సిరీస్ పేరు ‘ప్లీజ్ కమ్ బ్యాక్ మిస్టర్’ (Please Come Back, Mister). 2016లో వచ్చిన ఇది ఒక జపనీస్ నవల ఆధారంగా రూపొందింది. ఇందులో రెయిన్, ఓ యోన్-సో, లీ మిన్-జుంగ్, లీ హా-నీ లీడ్ రోల్స్ లో నటించారు. 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ Viki, hulu ఓటీటీలలో అందుబాటలో ఉంది. ఈ సీరీస్ రిలీజ్ అయిన టైమ్‌లోనే సూపర్ హిట్ అయిన ‘డిసెండెంట్స్ ఆఫ్ ది సన్’ (Descendants of the Sun) కూడా టెలికాస్ట్ అయ్యింది. దానివల్ల రేటింగ్స్ పరంగా దీనికి గట్టి పోటీ ఎదురైంది, కానీ కంటెంట్ పరంగా ఇది చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. ముఖ్యంగా రెయిన్ తన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఒక మధ్యవయస్కుడైన తండ్రి కుర్రాడి బాడీలోకి వస్తే ఎలా ప్రవర్తిస్తాడో భలేగా చూపించాడు. ఇక ఓ యోన్-సో అయితే ఒక రౌడీ క్యారెక్టర్‌ను అమ్మాయి బాడీలో అద్భుతంగా పండించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒకడు ఓవర్‌టైమ్ డ్యూటీలు చేసి చేసి ఆఫీసులోనే ప్రాణం విడిచిన ఫ్యామిలీ మ్యాన్ కిమ్. ఇంకొకడు రౌడీయిజం వదిలేసి హోటల్ పెట్టుకున్న మాజీ గ్యాంగ్‌స్టర్ గి-టాక్. ఈ ఇద్దరూ ఒకేసారి చనిపోయి పై లోకానికి వెళ్తారు. కానీ అక్కడ చచ్చాక కూడా తమ వాళ్ల మీద బెంగతో, కనీసం ఒక్కసారి వాళ్లను కలిసి అన్నీ చక్కబెట్టి రావాలని స్వర్గానికి వెళ్లే వాహనంలో నుంచి దూకబోతుంటారు. ఇంతలోనే వీళ్ళిద్దరికీ ఒక దేవత ఛాన్స్ ఇస్తుంది వీళ్ళ బాధను చూసి. కానీ ఒక కండిషన్ పెడుతుంది. వీళ్లు తమ పాత రూపాల్లో కాకుండా కొత్త బాడీల్లో వెళ్లాలి. నిబంధన ప్రకారం తామెవరో ఎవరికీ చెప్పకూడదు, చెబితే అసలు భూమి మీద వాళ్లకి సంబంధించిన గుర్తులే లేకుండా పోతాయి.

దీంతో ఆ అమాయకపు కిమ్ ఏకంగా, ధనవంతుడైన బాడీబిల్డర్ లాంటి ఒక హ్యాండ్సమ్ కుర్రాడి రూపంలోకి వస్తాడు. ఇక ఆ రౌడీ గి-టాక్ ఏమో అసలు ఊహించని విధంగా ఒక అతిలోక సుందరి బాడీలోకి వస్తాడు. తన పాత రౌడీ అలవాట్లు అస్సలు మానలేక ఆ అమ్మాయి బాడీతో వాడు పడే పాట్లు, చేసే కామెడీ మామూలుగా ఉండదు. చివరికి ఆ కొత్త రూపాలతో పెళ్లాం, పిల్లల కష్టాలను తీరుస్తారా ? తన చావు వెనుక ఉన్న కుట్రలను బయటపెడతారా ?వీళ్ళు మళ్ళీ తిరిగి స్వర్గానికి వెళ్లిపోతారా ? అనే విషయాలను, ఈ కొరియన్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  తెలివితేటలతో హైలెట్ అయ్యే తీర్పులు… రెండేళ్లుగా టాప్ ట్రెండింగ్ లో లీగల్ డ్రామా… ఐయండిబిలో 8 రేటింగ్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×