E-Paper
Advertisement

Lavanya Tripathi: గర్భవతిగా ఉండే, ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశా..!

Lavanya Tripathi: గర్భవతిగా ఉండే, ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశా..!
Advertisement

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి గర్భవతిగా ఉన్నప్పుడు చేసిన చిత్రం ప్రస్తుతం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఆమె ఆ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎప్పుడు విడుదలవుతుంది? అని అనుకుంటున్నారు కదా! లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Kondidela), దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). తాతినేని సత్య (Tatineni Satya) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 6న రిలీజ్ కాబోతుందని తెలిపేందుకు మేకర్స్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొన్నారు. ఆమె ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Also Read- Sampradayini Suppini Suddapoosani: థియేటర్లలోనే శివాజీ సాంప్రదాయని సుప్పిని  సుద్దపూసిని రిలీజ్…ఎప్పుడంటే?

ఇష్టపడి చేసిన చిత్రమిది

Advertisement

ఈ వేదికపై లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ.. ‘సతీ లీలావతి’.. నేను ఎంతో ఇష్టపడి చేసిన చిత్రమిది. వాస్తవానికి ఈ సినిమాను ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడే మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. అందుకు దర్శక, నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ వల్లే నేను చాలా హ్యాపీగా ఈ సినిమాను పూర్తి చేయగలిగాను. సప్తగిరితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అందరూ గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ (Dev Mohan) నటన అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది పూర్తి వినోదాత్మక చిత్రం. ఫ్యామిలీ అంతా థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మార్చి 6న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటి? జాకీలేసి లేపినా కష్టమేనా?

అందరికీ కనెక్ట్ అయ్యేలా

Advertisement

నటుడు సప్తగిరి మాట్లాడుతూ.. పాత ‘సతీ లీలావతి’ ఎంత పెద్ద హిట్ అయిందో మా ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాతకు ఇదే ఫస్ట్ ఫిల్మ్. అందరినీ ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది అని చెప్పారు. ‘‘కమల్ హాసన్ చేసిన ‘సతీ లీలావతి’తో మా సినిమాను పోల్చను. అందరూ రిలీట్ అయ్యేలా, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు దర్శకుడు తాతినేని సత్య. మొదటి చిత్రం ‘సతీ లీలావతి’ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు నిర్మాత నాగ మోహన్. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే.

Also Read- Chiranjeevi: ‘పునాదిరాళ్లు’ కోసం కెమెరా ముందు నిలిచిన రోజు.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×