E-Paper
Advertisement

Vishwambhara: ‘విశ్వంభర’ పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటి? జాకీలేసి లేపినా కష్టమేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటి? జాకీలేసి లేపినా కష్టమేనా?
Advertisement

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా కంటే ముందు విడుదల కావాల్సిన చిత్రమిది. ఇంకా చెప్పాలంటే 2025 సంక్రాంతికి విడుదల అని ప్రకటించి, చివరి నిమిషంలో ఆ స్లాట్‌ని మెగా పవర్ స్టార్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం కేటాయించారు. టీజర్, ఒక పాట, కొన్ని పోస్టర్స్ మినహా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉందో, లేదో అనేలా కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, లాస్ట్ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా, ఈ సంక్రాంతికి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. ఆ సినిమా తర్వాత చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం థియేటర్లలోకి రావడం, బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడం జరిగిపోయింది. అయినా కూడా ‘విశ్వంభర’ జాడ లేదు.

Also Read- Nikhil: ‘స్వయంభు’ కథ ఎవరిదో చెప్పిన నిఖిల్.. 1000 ఏళ్ల క్రితం అల్లరిచిల్లరిగా తిరిగే అతని కథంట!

ఇంకా విఎఫ్ఎక్స్ షాట్స్ రావాలి

Advertisement

మొన్నటి వరకు బిజినెస్ జరగలేదు, అందుకే ఆలస్యం అవుతుందనేలా వార్తలు వినిపించాయి. బహుశా అది నిజమే అయ్యి ఉండవచ్చు. లేదంటే, సంవత్సరాలకు సంవత్సరాలు తీసుకోవడానికి ఇదేం రాజమౌళి ఫిల్మ్ కాదు కదా. ఇక ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ తర్వాత చిరంజీవి (Megastar Chiranjeevi) మీడియా వారిని ఇంటికి పిలిపించుకుని మరీ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో ‘విశ్వంభర’ ప్రస్తావన రాగా, ఏప్రిల్‌లో రిలీజ్ ఉండొచ్చనేలా ఓ మాట అన్నారు. అప్పటి నుంచి ఈ సినిమా వార్తలలో నిలుస్తున్నా.. అంత హైప్ అయితే రావడం లేదు. తాజాగా దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) కూడా ఈ సినిమాపై హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు. ‘విశ్వంభర’ గురించి ఆయన చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇందులో సినిమా చాలా బాగా వచ్చిందని, చివరి అరగంట అయితే, వేరే లోకంలోకి వెళ్లిపోతారని చెబుతున్నాడు. ఇంకొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ రావాలని, అవన్నీ వచ్చిన తర్వాత మెగాస్టార్‌కి ఒకసారి చూపించి, అప్పుడు విడుదల తేదీని కన్ఫర్మ్ చేస్తామని ఈ వీడియోలో చెబుతున్నారు.

Also Read- Hushar Pittalu Teaser: గణేషుడితో స్టార్ట్ చేసి.. ఎక్కడికి తీసుకుపోయార్రా! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని?

సాలిడ్ కంటెంట్ వదిలితేనే..

Advertisement

అయితే అటు చిరంజీవి చెప్పినా, ఇటు దర్శకుడు వశిష్ట చెప్పినా, ఈ సినిమాపై ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రేంజ్‌లో హైప్ మాత్రం క్రియేట్ కావడం లేదు. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహాలో అద్భుతంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నా, ఎవరూ ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. సాలిడ్ కంటెంట్ వదిలితే తప్ప, ఈ సినిమాపై అటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కూడా నమ్మకం రాదు. అప్పటి వరకు ఎంత జాకీలేసి లేపాలన్నా, ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవడం కష్టమే. ఈ సినిమాతో వశిష్ట మరోసారి తనేంటో నిరూపించుకోవాలి. అది జరిగితేనే.. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది కూడా ఓ క్లారిటీ వస్తుంది. ‘బింబిసార’ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని, ఆయనకు వచ్చిన ఎన్నో ఆఫర్స్ వదులుకున్నారు వశిష్ట. ఆఖరికి ‘బింబిసార’ సీక్వెల్‌ కూడా వదిలేశారు. ఇప్పుడాయన పేరు మళ్లీ నిలబడాలన్నా, ఇండస్ట్రీలో వినబడాలన్నా.. కచ్చితంగా ‘విశ్వంభర’తో సక్సెస్ కొట్టాలి. అసలు అప్డేటే లేని సినిమాను ఎలా సక్సెస్ చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.

Also Read- Prabhas: ప్రభాస్‌కు ఎవరైనా ఎక్కువ నచ్చితే.. ఈ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వకుండా పంపించరట!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×