Akhira -Adivi Sesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నట వారసులు హీరోలుగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా(Akira) ఇండస్ట్రీలోకి రాకపోయినప్పటికీ ఈయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అకిరా సినీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అకిరా ఎంట్రీ గురించి పవన్ కళ్యాణ్ తో పాటు రేణు దేశాయ్(Renu Desai) కూడా ఇప్పటికే పలు సందర్భాలలో స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.
అకీరా కెరియర్ గురించి తాము ఏమాత్రం ఆలోచించలేదని తనకు ఏది ఇష్టమైతే ఆ రంగంలో తాము ప్రోత్సహిస్తామని తెలియజేశారు. అకీరాకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన మ్యూజిక్ విషయంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా విదేశాలలో అకిరా శిక్షణ తీసుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే ఈయన ఇండస్ట్రీలోకి వస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే తాజాగా అకీరా ఎంట్రీ గురించి నటుడు అడివి శేష్ స్పందిస్తూ అసలు విషయం తెలియచేశారు.
రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని విడిపోయినప్పటి నుంచి తన పిల్లలతో వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వారితో అకిరాకు మంచిది అనుబంధం ఉంది. ఇలా అకీరాకు చాలా క్లోజ్ అయినటువంటి వారిలో అడివి శేష్ ఒకరు. ప్రస్తుతం ఈయన డెకాయిట్(Dacoit) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో అడివి శేష్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్ అకీరా ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
నేను కూడా ఎదురు చూస్తున్నాను..
అకీరా త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. అకీరా కోసం శేష్ ఒక కథను కూడా సిద్ధం చేశారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శేష్ సమాధానం చెబుతూ అకీరాను అప్పుడప్పుడు కలుస్తాటాం, అతనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం లెఫ్ట్ హ్యాండర్స్ అన్న పాయింట్‌లో సింక్ అయ్యింది. ఇక ఇండస్ట్రీలోకి రాకముందే అకీరాకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందరిలాగే తాను కూడా అకిరా ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా శేష్ ఈ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్!