E-Paper
Advertisement

ప్రముఖ కొరియన్ నటుడు లీ సాంగ్-బో కన్ను మూత.. చిన్న వయస్సులో..

ప్రముఖ కొరియన్ నటుడు లీ సాంగ్-బో కన్ను మూత.. చిన్న వయస్సులో..

Lee Sang-bo: కొరియన్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తన విలక్షణ నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు లీ సాంగ్-బో (Lee Sang-bo) కన్నుమూశారు. 44 ఏళ్ల వయస్సులోనే ఆయన మరణించడం అంతర్జాతీయ సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్యోంగ్టెక్‌లోని తన నివాసంలో ఆయన నిర్జీవంగా కనిపించారు. దీంతో ఒక్క సారిగా కొరియన్ సినీ లోకంలో విషాద చాయలు అలముకున్నాయి.

Read also-Horror Comedy OTT : కాటికాపరి అవతారం ఎత్తే లాయర్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా

మరణం

లీ సాంగ్-బో నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక విచారణలో ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేదా నేరపూరిత కోణాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవిస్తూ, మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేమని ఆయన మేనేజ్‌మెంట్ సంస్థ ‘కొరియా మేనేజ్‌మెంట్ గ్రూప్’ ప్రకటించింది.

విషాదాల నీడలో

లీ సాంగ్-బో జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. గతంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన తన సోదరిని, తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ వరుస విషాదాలు ఆయనను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేశాయి. 2022లో ఆయన డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చినప్పటికీ, విచారణలో అవి కేవలం వైద్యులు సూచించిన యాంటిడిప్రెసెంట్ మందులేనని తేలింది. దీంతో ఒక్క సారిగా ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఆయనను పోలీసులు నిర్దోషిగా ప్రకటించారు. మరణానికి కొన్ని రోజుల ముందే ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్ట్‌లన్నింటినీ తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Read also-Horror Thriller OTT : మర్రిచెట్టు నీడలో భయపెట్టే ఆత్మ… జడిపిస్తున్న ఒక్కో ఎపిసోడ్

సినీ ప్రస్థానం

2006లో ‘ఇన్విజిబుల్ మ్యాన్ చోయ్ జాంగ్-సూ’ అనే డ్రామాతో తన నటనను ప్రారంభించిన లీ సాంగ్-బో, తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘మిస్ మాంటే క్రిస్టో’, ‘ప్రైవేట్ లైవ్స్’, ‘రూగల్’ వంటి సూపర్ హిట్ కొరియన్ డ్రామాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఇటీవల విడుదలైన ‘ది ఎలిగెంట్ ఎంపైర్’లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. లీ సాంగ్-బో మరణం కొరియన్ డ్రామా ప్రియులకు తీరని లోటు. మార్చి 29న ప్యోంగ్టెక్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్త అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

Big Stories

×