Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ 10 (Bigg Boss 10)కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి(Mithilesh Reddy) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక మిథిలేష్ రెడ్డి హౌస్ లో ఉన్నది కేవలం రెండు రోజులు అయినప్పటికీ 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని హౌస్ నుంచి బయటకు రావడంతో ఈయన పేరు మారుమోగిపోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిథిలేష్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష (Agnipariksha)కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమం అంటే కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనేవారు కానీ ఇటీవల కాలంలో అగ్నిపరీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమం ద్వారా కామన్ మ్యాన్ క్యాటగిరిలో పలువురు కంటెస్టెంట్లను ఎంపిక చేస్తూ వారిని హౌస్ లోకి పంపిస్తున్నారు. ఇలా అగ్ని పరీక్ష కార్యక్రమం గురించి వర్ష మిథిలేష్ రెడ్డిని ప్రశ్నించడంతో ఈయన అగ్ని పరీక్ష కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మిథిలేష్ మాట్లాడుతూ గత సీజన్ కి ముందు అగ్ని పరీక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ షో చాలా హిట్ అవ్వడమే కాకుండా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కామనర్ విన్నర్ గా నిలిచారు.
ఇక ఈసారి అగ్ని పరీక్ష కార్యక్రమం గతంతో పోలిస్తే ఐదింతలు మరింత సక్సెస్ అయిందని తెలిపారు. గతంలో కామనర్స్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత గుర్తింపు సంపాదించుకున్నారు కానీ ఈసారి మాత్రం అగ్నిపరీక్ష షోలోనే గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. ఇక అగ్నిపరీక్ష కార్యక్రమం మంచి సక్సెస్ కావడంతో ఈ ఫార్మాట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత బిగ్ బాస్ ముందు కంటే కూడా బిగ్ బాస్ తరువాత టెలికాస్ట్ చేస్తే మంచిదని తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఇలా బిగ్ బాస్ తర్వాత అగ్నిపరీక్ష టెలికాస్ట్ చేయటం వల్ల ప్రేక్షకులకు కూడా కామనర్స్, సెలబ్రిటీస్ అనే తేడా ఉండదు. అదే అగ్ని పరీక్ష చూడటం వల్ల ఒక కంటెస్టెంట్ పర్ఫామెన్స్ చూసి ఇతనే విజేత అవుతారనే ఆలోచనకు ప్రేక్షకులు వస్తారు. ఇలా చేయటం వల్ల సెలబ్రిటీలకు నష్టం జరుగుతుందని మిథిలేష్ తెలిపారు. ఇక సెలబ్రిటీల కంటే కూడా కామనర్స్ విన్నర్ కావడం గురించి మిథిలేష్ మాట్లాడుతూ.. ఎక్కడో ఒకచోట ప్రేక్షకులకు కూడా వీడు మనోడే అంటూ కామనర్స్ పై ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అందుకే వాళ్ళు విన్నర్ అవుతారని తెలిపారు. అదేవిధంగా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీలు కూడా కామనర్స్ పట్ల కాస్త చులకన భావనతో ఉన్నారని అందుకే కామనర్స్ కు ఓటు బ్యాంకింగ్ పెరిగిందని మిథిలేష్ తెలిపారు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అందరూ సమానమని బేధ భావాలు చూపించకపోతే ఖచ్చితంగా సెలబ్రిటీలు కూడా విన్నర్ అవుతారని మిథిలేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: మీ ఇంట్లో డబ్బు తీసుకెళ్లానా?రూ.15 లక్షల ట్రోల్స్ పై మిథిలేష్ షాకింగ్ రియాక్షన్!