BigTV English

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?
Advertisement

Lokesh Kanagaraju : లోకేష్ కనగరాజ్… తక్కువ టైంలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ లాంటి హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. కమల్ హాసన్‌కు అయితే ఏకంగా కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీని ఇచ్చాడు. రజనీకాంత్‌తో చేసిన కూలీ మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ పరిస్థితి మారిపోయిందని తెలుస్తుంది. ఈ రిజల్ట్, వచ్చిన టాక్ వల్ల ఓ స్టార్ హీరో లోకేష్ కనగరాజ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…


కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. రజనీకాంత్‌తో కూలీ మూవీ చేశాడు. ఇదే సినిమాలో టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర, మలయాళం ఇండస్ట్రీ నుంచి సౌబిన్ ఉన్నాడు. అలాగే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కూడా ఇదే సినిమాలో గెస్ట్‌గా కనిపించాడు. అయినా ఈ మూవీకి మిక్సిడ్ టాక్ వచ్చింది.

ముఖ్యంగా అమీర్ ఖాన్ పాత్రపై ఆడియన్స్ హై ఎక్స్‌‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర కంటే హై గా ఉంటుందని అనుకున్నారు. కానీ, సినిమా రిలీజ్ అయ్యకా చూస్తే, అమీర్ ఖాన్ పాత్ర వైలెంట్‌గా ఉండటం పక్కన పెడితే, కామెడియన్ అంటూ ట్రోల్స్ వచ్చాయి.


ఒక కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా అలాంటి కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్, ట్రోల్స్ అమీర్ ఖాన్ చెవున కూడా పడ్డాయట. దీంతో ఈ బాలీవుడ్ స్టార్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. హర్ట్ అవ్వడమే కాదు… లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే సినిమాను కూడా రద్దు చేసుకున్నాడనే వార్తలు ఇప్పుడు బీ టౌన్‌లో వినిపిస్తున్నాయి.

కాగా, లోకేష్ తన డ్రిమ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌ను మొన్నా ఆ మధ్య అమీర్ ఖాన్‌కు వినిపించాడట. అతనికి అది బానే నచ్చిందట కూడా. కూలీ తర్వాత ఖైదీ 2 తెరకెక్కించి, తర్వాత అమీర్ ఖాన్ – లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించాలని అనుకున్నారట.

కానీ, ఇప్పుడు కూలీ మూవీలో అమీర్ ఖాన్ పాత్రపై ట్రోల్స్ రావడంతో, ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ హర్ట్ అయిపోయారట. దీంతో ఆ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పి రద్దు చేసుకున్నాడని టాక్.

అయితే, లోకేష్ కనగారాజ్ ప్రస్తుతం అన్నీ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టి, రజనీకాంత్ – కమల్ హాసన్ తో ఓ మల్టీ స్టారర్ చేస్తున్నాడని, అందుకోసం స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడనే టాక్ ఉంది. దీంతో కార్తీ కూడా ఖైదీ 2 లేట్ అవుతుందని వేరే డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక్కడ అమీర్ ఖాన్ కూడా లోకేష్ కనగరాజ్ పై హోప్స్ వదులుకోవడానికి ఇదో ఒక కారణం అయి ఉండొచ్చు అనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తుంది. ఏది ఏమైనా… ఎన్నో అంచనాలు పెట్టుకున్న లోకేష్ కనగరాజ్ – అమీర్ ఖాన్ కాంబినేషన్ మూవీ లేదని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Related News

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Big Stories

×