Lemon peels: మన వంటల్లో ఎక్కువగా పండ్లూ, కూరగాయలూ ఉపయోగించే ముందు ఎలా వాడుతాం? దాని పై వున్న తొక్కలను తీసి, కూరగాయను కోసి ముక్కలుగా చేసుకుని వండుకుంటాం కదా, అయితే ఆ తొక్కతోనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు? ఎందుకు కంటే మన విషయంలో తొక్క అనేది ఒక నిరుపయోగం(వేస్ట్) అంతే, అది ఒక చెత్తగా తప్ప మనకు అది దేనికి ఉపయోగపడదని మైండ్ లో ఫిక్స్ అయిపోయాము. అయితే ఆ తోక్కతో మన ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? అందులో ఒకటి నిమ్మకాయ తొక్క. అవును నిమ్మకాయ తొక్కతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిమ్మకాయ తొక్కలు విటమిన్ సితో నిండుగా ఉన్నాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, సాధారణ వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తాయి. వీటిలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల బలాన్ని పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. యాంటీబాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె పనితీరును సరిగ్గా బ్యాలెన్స్ చేయడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
Also Read: Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారందరికి త్వరలో స్మార్ట్ కార్డులు
ఇంకా నిమ్మ తొక్కల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. గట్ అంటే మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమై, అందులోని పోషకాలు శరీరానికి అందేలా ఆరోగ్యాన్ని మెరుగుపరచి, బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. రోజువారీ ఆహారంలో కొద్దిగా నిమ్మ తొక్క తురుము చేర్చితే భోజనానికి రుచి పెరగడంతో పాటు శరీరానికి కూడా మేలు చేస్తుంది. సలాడ్‌లు, సూప్‌లు, డెజర్ట్‌లకు తొక్క తురుము వేస్తే ప్రత్యేకమైన తాజాదనం వస్తుంది.
చాలామంది నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిగా మార్చుకుని వంటల్లో వాడుతారు. దానిని నూనె, వెన్న, చక్కెర వంటి పదార్థాలతో కలిపి ఊరగాయలు, సాస్‌లు, డిప్‌లు చేసుకోవచ్చు. నాన్‌వెజ్ (మాంసాహార) వంటల్లో, డెజర్ట్‌లలో, కాక్‌టెయిల్‌లలో, మసాలా మిశ్రమాలలో కూడా ఈ పొడి రుచిని పెంచుతుంది. తేనె, దాల్చిన చెక్కతో పాటు నిమ్మ తొక్క పొడిని టీలో వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. శరీరానికి తేలికపాటు కలగడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా బయటపడేసే ఈ నిమ్మ తొక్కలు కూడా ఎంత ఉపయోగకరమో తెలిసాక వాటిని వాడే అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది.