E-Paper
Advertisement

Lokesh Kanagaraj: ‘హెరాల్డ్ దాస్’ కోసం లోకేష్ క్రేజీ ట్వీట్.. ఆల్ ది బెస్ట్ సార్!

Lokesh Kanagaraj: ‘హెరాల్డ్ దాస్’ కోసం లోకేష్ క్రేజీ ట్వీట్.. ఆల్ ది బెస్ట్ సార్!
Advertisement

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Action King Arjun Sarja)ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ హీరోగా, లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ సినిమాలో అర్జున్‌ను హెరాల్డ్ దాస్‌గా ఒక రేంజ్‌లో చూపించిన లోకేష్, ఇప్పుడు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam). ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అర్జున్ కూడా ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ఆయన మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read- Akira Nandan: అకీరా నందన్ ఎంట్రీ ఆ దర్శకుడితోనా? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్

Advertisement

‘సీతా పయనం’తో అర్జున్ మళ్ళీ మెగాఫోన్ పట్టడం పట్ల లోకేష్ తన సంతోషాన్ని తెలియజేశారు. ‘ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే పర్ఫార్మర్, థాట్‌ఫుల్ డైరెక్టర్’ అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కేవలం అర్జున్ డైరెక్షన్ వల్లే కాదు, ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటం వల్ల కూడా స్పెషల్ అయ్యింది. ఆమెకు కూడా లోకేష్ కనగరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా మీ అద్భుతమైన ప్రయాణంలో మరో బలమైన అధ్యాయంగా నిలవాలి సార్ అని అర్జున్‌కు చెబుతూ.. ‘సీతా పయనం’ చిత్ర బృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు, ఈ సినిమా విడుదలవుతున్న నాలుగు భాషల ట్రైలర్స్‌ని ఆయన విడుదల చేశారు. ప్రస్తుతం లోకేష్ చేసిన ఈ ట్వీట్‌కు మంచి స్పందన వస్తోంది.

Also Read- Anil Ravipudi: యాక్షన్.. కట్ మీరే చెప్పేయండి.. ఫైనల్లీ తన సినిమాపై అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!

ఎలాంటి మ్యాజిక్ చేస్తారో..

Advertisement

‘లియో’లో విలన్‌గా మెప్పించిన యాక్షన్ కింగ్, ఇప్పుడు డైరెక్టర్‌గా తన కుమార్తె కెరీర్‌కు మరో బలమైన చాప్టర్‌ను సిద్ధం చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్ సపోర్ట్ తోడవ్వడంతో ఈ సినిమాపై పాన్-ఇండియా లెవల్లో బజ్ క్రియేట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఆయన విషెస్‌తో ఈ సినిమాకి మంచి బూస్ట్ దొరికింది. మరి తన తండ్రి డైరెక్షన్‌లో ఐశ్వర్య అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ‘సీతా పయనం’ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఈ తండ్రీకూతుళ్లకు మంచి హిట్ రావాలని అన్ని ఇండస్ట్రీలో కోరుకుంటున్నాయి. చూద్దాం.. మరి ఎలాంటి సక్సెస్‌ను వీరు నమోదు చేస్తారో..

Also Read- Allu Arjun Bollywood Debut: అల్లు అర్జున్ – భన్సాలి సినిమా ఆగలేదా..అసలు ట్విస్ట్ ఇదే..!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×