E-Paper
Advertisement

Inzamam-ul-Haq: 300 కంటే ఎక్కువ‌ స్కోర్ చేసి, ఇండియాను చిత్తుగా ఓడిస్తాం

Inzamam-ul-Haq: 300 కంటే ఎక్కువ‌ స్కోర్ చేసి, ఇండియాను చిత్తుగా ఓడిస్తాం
Advertisement

Inzamam-ul-Haq:  ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC T20 World Cup 2026 tournament) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మధ్య మ్యాచ్ జరగడంపై అనేక వార్తలు వచ్చాయి. ముందుగా మ్యాచ్ జరగబోదని… ఆ తర్వాత మ్యాచ్ జరుగుతుందని… లేదు లేదు మా డిమాండ్లు పరిష్కరించకపోతే, టోర్నమెంట్ ఆడబోమని పాకిస్తాన్ రోజుకో మాట, పూటకో డ్రామా వేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగింది. ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో దిగివచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board). దీంతో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సంసిద్ధమైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు పాకిస్తాన్ సర్కార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో కచ్చితంగా ఇండియాని ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

ఇండియాను ఓడించి తీరతాం.. పాకిస్తాన్ సంచలనం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎట్టకేలకు జరగనుంది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ రెండు జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఎట్టకేలకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ మ్యాజిక్ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ స్పందించడం జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో తమదే విజయమని ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq ) వెల్లడించారు.

తమ గెలుపు ను ఆపడం ఎవడి తరం కాదని హెచ్చరించారు. ఈ మ్యాచ్ లో గెలిచి… ఇండియాలో ఏడిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఇండియాను ఓడించే బాధ్యత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తే 300కు పైగా పరుగులు సాధించడం గ్యారంటీ అన్నారు. ఈ దెబ్బకు టీమిండియా ఓడిపోతుందని కూడా కౌంటర్ పేల్చారు. అంతేకాదు ఈ మ్యాచ్ లో 200 పరుగుల కంటే ఎక్కువ తేడాతో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని తెలిపారు. ముఖ్యంగా బాబర్ ఆజం ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం పక్కా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ పై ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన త‌రుణంలో ఇండియన్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఐసీసీ టోర్న‌మెంట్ ల‌లో ఇండియాను ఓడించే ద‌మ్ము పాకిస్తాన్ కు లేద‌ని ఫైర్ అవుతున్నారు.

Advertisement

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

https://twitter.com/IS_Netwrk29/status/2021234577415578097?s=20

 

Related News

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

Big Stories

Advertisement
×