Tollywood Movies : ఒకప్పుడు సినిమాలు హిట్ అవ్వాలంటే భారీ బడ్జెట్ ని కేటాయించాలి. అలాగే స్టార్ హీరోల సినిమాలు అయితేనే చాలు అని అనుకునేవారు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. భారీ బడ్జెట్ చిత్రాల కన్నా కూడా చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రిజల్ట్ ని అందుకుంటున్నాయి. చిన్న సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి తమ సత్తాను చాటుకున్నారు.. చిన్న బడ్జెట్‌తో, అద్భుతమైన కథలతో వచ్చి థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు ఈ మధ్య చాలానే వచ్చాయి.. మౌత్ టాక్ తోనే భారీ విషయాలను సొంతం చేసుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన ఆ సినిమాలేవో ఒక్కసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గతంలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కార్తికేయ.. మూవీకి సీక్వల్ గా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది.. తక్కువ బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే మంచి హిట్ అందుకుంది. శ్రీకృష్ణుడి నమ్మకం, చరిత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ, తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా స్వారీ గానే విజయాన్ని సొంతం చేసుకుంది. మూవీకి సీక్వల్ గా మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.
దేవుడి కథతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చి బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాలలో హనుమాన్ సినిమా కూడా ఒకటి.. పురాణాల బ్యాక్‌డ్రాప్‌కు సూపర్ హీరో ఎలిమెంట్స్ జోడించి, అద్భుతమైన విజువల్స్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది..
ఒక చిన్న పల్లెటూరులో గ్రామీణ స్టోరీ తో వచ్చిన సినిమా బలగం.. కుటుంబం కలిసి ఉండాలి అన్నా కథ ఇది.. ఇందులో స్టార్ హీరోయిన్లు, హీరోలు లేరు. కేవలం ఒక కుటుంబం స్టోరీ..ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఎమోషన్స్‌ను పండించడంతో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..
Also Read :యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?
వీటితో పాటుగా డీజె టిల్లు.. టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా రొమాంటిక్ మూవీ గా జనాలను బాగా ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వీటితో పాటుగా వేరే భాషల్లో సినిమాల విషయానికొస్తే కాంతార సినిమా అందరిని ఆకట్టుకుంది.. అదేవిధంగా మంజుమల్ బాయ్స్ మలయాళం లో బిగ్గెస్ట్ గా నిలిచింది… ఇవన్నీ కేవలం తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించిన సినిమాలే..