E-Paper
Advertisement

సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం.. స్నేహితులను కలవడానికి వెళ్ళి!

సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం.. స్నేహితులను కలవడానికి వెళ్ళి!
Advertisement

Chandra Bose:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గేయ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్(Chandrabose) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రాజేంద్ర (Rajendra) నేడు ఉదయం గుండెపోటు సమస్యతో మరణించారు. ఇలా ఉన్నఫలంగా రాజేంద్ర మరణించడంతో చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోదరుడు రాజేంద్ర మరణంతో చంద్రబోస్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర మరణానికి గల కారణాలు ఏంటనే విషయాన్నికి వస్తే..

గుండెపోటుతో మరణించిన రాజేంద్ర..

రాజేంద్ర అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో ఉన్న తన స్నేహితుడిని కలవడం కోసం శనివారం రాత్రి అక్కడికి చేరుకున్నారట. అయితే రాత్రి తన స్నేహితుడి ఇంట్లోనే బస చేసిన రాజేంద్ర ఆదివారం ఉదయం ఉన్న ఫలంగా అస్వస్థతకు గురి అయ్యారని తెలుస్తుంది. చాతిలో నొప్పిగా ఉందని తన స్నేహితులకు చెప్పడంతో వెంటనే తన స్నేహితులు అప్రమత్తమయ్యి తనని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. ఇలా హాస్పిటల్ కి వెళ్లిన రాజేంద్రకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. అప్పటికే రాజేంద్ర పరిస్థితి విషమించడంతో ఈయన ఆఖరి శ్వాస వదలారు.. ఇలా రాజేంద్ర మరణించారనే విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

స్నేహితుడి ఇంటికి వెళ్లి..

Advertisement

సరదాగా స్నేహితుడిని కలవడానికి వెళ్లిన రాజేంద్ర ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టివేసింది..ఈ విషయం తెలుసుకున్నటువంటి సినిమా ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చంద్రబోస్ సోదరుడి రాజేంద్ర మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.. రాజేంద్ర అంత్యక్రియలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఉన్నఫలంగా సోదరుడు మరణంతో చంద్రబోస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత..

Advertisement

ఇక చంద్రబోస్ సినీ గే రచయితగా ఇండస్ట్రీలో అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు అందించారు. రచయితగా మాత్రమే కాకుండా ఈయన మంచి సింగర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చంద్రబోస్ అందించిన పాటలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈయన రాసిన నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస (Oscar Award)సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో చంద్రబోస్ బిజీగా ఉన్నారు. ఈయన బుల్లి తెరపై ప్రసారమయ్యే సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read: పెద్ది రాకతో చిరు సినిమాకు లైన్ క్లియర్…విశ్వంభర రిలీజ్ అప్పుడేనా?

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×