E-Paper
Advertisement

Maremma Teaser: ఊరంతా వల్లకాడు.. ‘మారెమ్మ’ టీజర్ ఎలా ఉందంటే?

Maremma Teaser: ఊరంతా వల్లకాడు.. ‘మారెమ్మ’ టీజర్ ఎలా ఉందంటే?
Advertisement

Maremma Teaser: మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ (Maadhav Bhupathiraju) విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో మంచాల నాగరాజు (Manchala Nagaraj) కూడా టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, చిత్ర టీమ్ బుధవారం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ ఇటీవల వచ్చిన ‘ఎల్లమ్మ’ అనౌన్స్‌మెంట్ వీడియోను తలపిస్తుండటం విశేషం. అయితే ఇందులో ఉన్న పాయింట్ మాత్రం వేరే అనేది తెలుస్తోంది. అసలీ టీజర్ (Maremma Official Teaser) ఎలా ఉందంటే..

Also Read- Ramcharan Upasana: మెగా ట్విన్స్ రాక.. ఎలిఫెంట్ థీమ్ తో అదిరిపోయే గిఫ్ట్.. క్రేజీగా ప్లాన్ చేసిన చరణ్ ఉపాసన!

అమ్మవారి దున్నపోతు అదృశ్యం

Advertisement

‘‘ఒక అంటువ్యాధి గ్రామాన్ని చుట్టేయడంతో గ్రామంలోని ప్రజలు, పశువుల టపా టపా రాలిపోతుంటాయి. ఊరంతా వల్లకాడుగా మారుతుంటుంది. ఊరి పెద్ద అయిన వినోద్ కుమార్ గ్రామస్తులతో కలిసి తమ గ్రామ దేవత మారెమ్మ తల్లిని ప్రార్ధిస్తారు. ఆ దేవతకు సంబంధించిన దున్నపోతును కాపాడే బాధ్యత హీరో తీసుకుంటాడు. ఒక రోజు ఆ దున్నపోతు అనూహ్యంగా అదృశ్యమవుతుంది. ఇక్కడి నుంచే కథ కీలక మలుపులు తిరుగుతుంది. ‘అది అమ్మవారి దున్నపోతురా.. దానిని ఊరు దాటించుడు ఎవ్వరితరం కాదు’ అని వినోద్ కుమార్ అంటే, సాహసం చేసి మరీ హీరో ఆ అమ్మవారి దున్నపోతును పట్టుకొస్తాడు. ఈ మధ్యలో ఏం జరిగిందనేదే అసలైన కథ అని అర్థమవుతోంది. హీరో మాధవ్‌కు తొలి చిత్రమైనప్పటికీ, చాలా ఇంటెన్స్‌గా కనిపించాడు. పూర్తిగా రూరల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. తొలి సినిమాలోనే ఎంతో అనుభవం వున్న నటుడిలా కనిపిస్తున్నాడు. అతనికి జోడీగా దీపా బాలు (Deepa Balu) చాలా సహజంగా కనిపించింది. గ్రామ పెద్ద పాత్రలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ మరోసారి ఓ బలమైన పాత్ర చేసినట్లుగా ఈ టీజర్ తెలియజేస్తోంది.

Also Read- Leader Glimpse: మరో ‘లీడర్’ వస్తున్నాడు.. గ్లింప్స్ వచ్చింది చూశారా?

చాలా మంచి పాయింట్

Advertisement

ఇక దర్శకుడు మంచాల నాగరాజు తన తొలి ప్రయత్నంలోనే తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన కథను సిద్ధం చేశాడనే ఫీల్‌ని ఈ టీజర్‌తో ఇచ్చారు. బోనాలు, అమ్మవారి దున్నపోతు ఇవన్నీ కూడా చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్స్ కాబోతున్నారనేది ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ టీజర్‌ను విడుదల చేసిన డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ.. మాస్ మహారాజాతో జర్నీ చేస్తున్నప్పుడు మాధవ్‌ని చూస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాగే మాధవ్ కూడా తన కాళ్ళ మీద తనే నిలబడాలని ఆయన విష్ చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే చాలా మంచి పాయింట్ చుట్టూ ఈ కథను నడిపారని అనిపిస్తుంది. సినిమా బాగుంటే కచ్చితంగా మాస్ మహారాజా ఫాన్స్, ఆడియన్స్ అందరు కూడా చూస్తారు. ఈ టీజర్‌లో నాకు మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. టీజర్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంత ఎక్సైటింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ గుడ్ లక్ అని అన్నారు.

Also Read- Sri Chidambaram Garu: నా సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×