Leader Glimpse: దగ్గుబాటి రానా అరంగేట్ర చిత్రం ‘లీడర్’.. జనాలపై ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడిపై కూడా ఒత్తిడి వచ్చేంతగా, ‘లీడర్’కు అభిమానులు ఉన్నారు. మరి శేఖర్ కమ్ముల ‘లీడర్’ సీక్వెల్ ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ,.. ఇప్పుడు ‘లీడర్’ అంటూ మరో హీరో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాకపోతే అతను మన తెలుగు హీరో కాదు. తమిళ హీరో లెజెండ్ శరవణన్ (Legend Saravanan) హీరోగా నటిస్తున్న నూతన చిత్రానికి ‘లీడర్’ (Leader) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ (RS Durai Senthilkumar) దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌ఫుత్ (Payal Rajput) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని (Leader Glimpse) మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Eesha Rebba: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఈషా రెబ్బా… అసలేం జరిగిందంటే?
పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో వచ్చిన ఈ సినిమా సరికొత్త ‘లీడర్’ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే.. విలన్‌కు చెందిన 9 కంటెయినర్లు కనిపించకుండా పోయినట్లుగా చూపించారు. ఆ కంటెయినర్స్ కోసం విలన్ అనుచరులు వెతుకుతుండగా, ఒక చోట అవన్నీ కనిపిస్తాయి. కానీ ఆ కంటెయినర్స్ డ్రైవర్స్, రౌడీలు అంతా చనిపోయి ఉంటారు. వాళ్లను వెతుక్కుంటూ వచ్చిన రౌడీలను కూడా హీరో మట్టుబెడతాడు. ఎవరు చంపారు? అని ఆరా తీస్తే అక్కడ ఉన్న అమ్మాయి వాళ్ల నాన్న అని.. విలన్ అనుచరుడు మెయిన్ విలన్‌కు ఫోన్‌లో చెబుతుంటాడు. ఏరా నువ్వు హీరో అనుకుంటున్నావా? అని విలన్ ఫోన్ చేసి అడిగితే, ‘నీ యబ్బ అవునురా.. పిల్లలందరికీ తమ తండ్రులే హీరోలురా..’ అనే డైలాగ్‌తో గ్లింప్స్ ఓ రేంజ్‌లో ఉండగా, చివరిలో తన కుమార్తె.. ‘ఐ లైక్ దిస్ ఫ్లేవర్ నాన్న’ అని అనడం మరింత ఆసక్తికరంగా ఉంది. టెక్నికల్‌గా ఈ గ్లింప్స్ హై స్టాండర్ట్స్‌లో ఉంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు వావ్ అనాల్సిందే. ఆ రేంజ్‌లో ఈ గ్లింప్స్‌ని రెడీ చేశారు.
Also Read- Bandla Ganesh: ‘ఎమ్మెల్సీ ఇస్తాం.. పవన్ కళ్యాణ్‌ని తిట్టాలి’ ఆఫర్‌కు బండ్ల స్పందనిదే.. వీడియో వైరల్!
ఇక ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్ మాఫియా, పోలీస్ ఫోర్స్ మధ్య చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ రెండు వర్గాల సంఘర్షణ మధ్య తనని తాను రక్షించుకుంటూ.. ఆ సాధారణ వ్యక్తి ఎలా బయటపడ్డాడనేది ఆద్యంత ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నాం. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. జైపూర్, ఊటీ, జార్జియా, చెన్నై వంటి లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాం. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ అన్నీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. ఏప్రిల్‌లో గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్ వంటి వారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
Also Read- Film Awards: రిలీజ్ కానీ సినిమాకు 3 అవార్డులు.. గవర్నమెంట్‌పై ట్రోలింగ్!